Wednesday, May 14, 2025

రిటైర్మెంట్ తర్వాత ఎలాంటి పదవులూ స్వీకరించను

- Advertisement -
- Advertisement -

చివరి రోజు విధి నిర్వహణల అనంతరం సిజెఐ ఖన్నా వెల్లడి
నేడు కొత్త సిజెఐగా గవాయ్ బాధ్యతలు

న్యూఢిల్లీ: పదవీ విరమణ తర్వాత ఎటువంటి అధికారిక పదవులను చేపట్టబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా స్పష్టం చేశారు. సిజెఐగా సంజీవ్ ఖన్నా పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. సుప్రీంకోర్టులో చివరి రోజు బెంచ్ కార్యకలాపాలు ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఖన్నా మాట్లాడుతూ పదవీ విరమణ తర్వాత ఎటువంటి అధికారిక పదవులను చేపట్టబోనని స్పష్టం చేశారు.

న్యాయవ్యవస్థలో ఏదైనా చేయాలని అనుకొంటున్నట్లు చెప్పారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. కాగా హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టలు కనుగొనడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సిన్హా సమాధానమిస్తూ. న్యాయవ్యవస్థ ఆలోచన నిర్ణయాత్మకం, న్యాయనిర్ణేతగా ఉండాలని అన్నారు. ‘మేము ప్లస్, మైనస్‌లు అన్నీ పరిశీలిస్తాం.ఆ తర్వాత హేతుబద్ధంగా అన్ని అంశాలను ఆలోచిస్తాం. అవన్నీ సరయిన నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడతాయి’ అని అన్నారు.

భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా 2024 ఏప్రిల్ 11న బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు దివంగత మాజీ న్యాయమూర్తి హెచ్‌ఆర్ ఖన్నా సమీప బంధువు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయినఖన్నా తదుపరి ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 జనవరి 19న సుప్రీంకోర్టు జడ్జిగా, నవంబర్ 11న సిజెఐగా బాధ్యతలు చేపట్టారు.

నేడు కొత్త సిజెఐగా గవాయ్ ప్రమాణం

కాగా భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ బుధవారం(14న) బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన సిజెఐతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సీనియారిటీపరంగా తన తర్వాతి స్థానంలో ఉన్న గవాయ్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఖన్నా గతంలో సిఫార్సు చేయగా కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. 6 నెలలుకు పైగా సిజెఐ పదవిలో కొనసాగనున్న గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News