క్లాస్ రూమ్‌లో బెంచీలన్నీ ఒకే వరుసలో
విద్యార్థుల్లో బ్యాక్ బెంచర్లన్న న్యూనతను తొలగించే
ప్రయత్నం కొత్త పంథాకు శ్రీకారం చుట్టిన పాఠశాలలు
స్తనార్ధి శ్రీకుట్టన్ సినిమా స్ఫూర్తి
కొల్లాం: కేరళలోని కొల్లాం జిల్లా వలక్కమ్‌లోని రామవిలాసం వోకేషనల్ హైయ్యర్ సెకండరీ స్కూల్(ఆర్‌విఎస్‌ఎస్)లో విశిష్ట క్లాసురూం ఏర్పాట్లు ఉన్నాయి. ఈ పాఠశాలలో వెనుకసీటు విద్యార్థులు ఉండరు. తరగతి గదిలో ఒకే వరుసలో విద్యార్థులకు సీట్లు ఉంటాయి. దీనితో తాము బ్యాక్‌బెంచర్స్‌మనే భావన ఏ విద్యార్థికి కలగదు. అందరిని ఒకే వరుసలో కూర్చోబెట్టి చెప్పడం ఈ స్కూల్ ప్రత్యేకత. ఈ స్కూల్ పూర్వపు విద్యార్థిని జిపి నందన సివిల్ సర్వీసెస్ పరీక్షలలో జాతీయ స్థాయిలో 47వ ర్యాంకు, కేరళలో రెండో ర్యాంకు పొందింది. ఈ క్రమంలో ఈ స్కూల్ ఆవరణలో అభినందనల గర్వకారక కటౌట్ వెలిసి ఉంటుంది. ఆమె సాధించిన విజయం తెలిపే వివరణతో స్కూల్‌కు వచ్చే విద్యార్థులకు స్ఫూర్తిదాయకం అవుతోంది. బ్యాక్‌బెంచ్ విద్యార్థులు ఉండరాదు, వెనుకబడితే వెనుకోనోయి అనే నినాదంతో , మలయాళం సినిమా స్తనార్థి శ్రీకుట్టన్ ఇతివృత్తం స్ఫూర్తితో స్కూల్‌లో ఈ ఒకే వరుస విద్యాబోధన ఏర్పాట్లు చేశారు.
ఈ స్కూల్‌కు ముందే పంజాబ్‌లోని ఓ స్కూల్‌లో ఇటువంటి ఒకే వరుస సీట్ల ఏర్పాట్లతో క్లాసు రూంలను తెరిచారు. విద్యార్థులకు తమ చిత్రం ద్వారా ప్రయోజనం దక్కడం, విద్యాసంస్థలు స్ఫూర్తి పొందడం తమకు సంతోషకరం అని సినిమా ర్శకులు వినేష్ విశ్వనాథన్ తెలిపారు. తమ సినిమాలో ఈ విధమైన సీటింగ్ ఏర్పాట్లతో ఒకే ఒక్క సీన్ ఉందని గుర్తు చేశారు. తక్కువగా చదివే లేదా ప్రతిభలో వెనుకబడే విద్యార్థులు, ఆద్యంతం రాణించే విద్యార్థులనే తేడా మంచిది కాదని, ఇప్పటికే నార్వే , ఫిన్లాండ్‌లలో ఇటువంటి సింగిల్ వరుస ఏర్పాట్లతోనే విద్యాబోధన ఉందని, పలు ఉత్తమ ప్రమాణాలతో ఫలితాలు వెలువడుతున్నాయని దర్శకులు తెలిపారు. దీనిని తమ సినిమాలో అంతర్లీనంగా చెప్పామని, దీనిని అంతా పాటిస్తే తమకు మరేమి కావాలని ప్రశ్నించారు. ఇక ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహేంద్ర సింగిల్ కేరళ, పంజాబ్‌లలో క్లాసురూం విధానాన్ని స్వాగతించారు.