- Advertisement -
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలి జిల్లాలో మరోసారి మేఘాలు విస్పోటనం చెంది బీభత్సం సృష్టించింది. శుక్రవారం చమోలీ జిల్లాలో తెల్లవారుజామెన కురిసిన భారీ వర్షానికి పలువురు గల్లంతయ్యారు. భారీ వర్షం పడడంతో కొండచరియలు విరిగి ఇళ్లపై పడిపోయాయి. ఆ ప్రాంతంతో ఉన్న దుకాణాలు, వాహనాలతో సహా గృహ ప్రాంతాలు దెబ్బతిన్నాయి. పది రోజుల క్రితం జమ్ముకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్‌లో క్లౌడ్ బరస్ట్ జరగడంతో 65 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 100 మంది కన్నా ఎక్కువ మంది గాయపడ్డారు. దాదాపు 200 మంది గల్లంతైన విషయం విధితమే.
- Advertisement -