Monday, August 25, 2025

ఉస్మానియా వర్శిటీకి గొప్ప చరిత్ర ఉంది: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉస్మానియా వర్శిటీని సందర్శించాలని ఓయూ విసి కుమార్ ఆహ్వానించారని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఓయూ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాలని కోరారని అన్నారు. ఉస్మానియా వర్శిటీలో పలు అభివృద్ధి పనులకు సిఎం శ్రీకారం చుట్టారు. 90 కోట్లతో నిర్మించిన భవనాలను ప్రారంభించారు. డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, వేం నరేందర్ రెడ్డి, కోదండరామ్, ఓయూ విసి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..ఉస్మానియా వర్శిటీ అనే పదం తెలంగాణకు ప్రత్యామ్నాయ పదమని, ఉస్మానియా వర్శిటీ, తెలంగాణ అవిభక్త కవలలు లాంటివి అని తెలియజేశారు. పివి నరసింహరావు, చెన్నారెడ్డి, జైపాల్ రెడ్డి ఉస్మానియా వర్శిటీ నుంచి వచ్చిన వారేనని, తెలంగాణలో ఏదైనా సమస్య వచ్చినా, ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియా వర్శిటీ అని కొనియాడారు.

చదువుతో పాటు పోరాటాన్ని నేర్పింది ఉస్మానియా వర్శిటీయేనని, యాదయ్య.. తెలంగాణ సాధన కోసం అమరులయ్యారని అన్నారు. ఐపిఎస్, ఐఎఎస్ లను (IPS,IAS) అందించింది ఉస్మానియా వర్శిటీనని, ఉస్మానియా వర్శిటీకి గొప్ప చరిత్ర ఉందని, వందేళ్ల ఓయూకు విసిగా దళితుడిని నియమించింది ప్రభుత్వమేనని చెప్పారు. గత పాలకులు కుట్రపూరితంగా ఓయూ నిర్వీర్యం చేయాలని చూశారని మండిపడ్డారు. ఉస్మానియా వర్శిటీలో చదువుకున్న వారికి చాలా అవకాశాలు వచ్చాయని, యువ నాయకత్వం దేశానికి అవసరం ఉందని అన్నారు. దేశానికి అతిపెద్ద సంపద యువతేనని, ఉస్మానియా వర్శిటీలో చదువులకే కాకుండా పరిశోధనలకు వేదిక కావాలని కోరారు. పాఠశాలలు, కళాశాలలను గంజాయి పట్టి పీడిస్తున్నాయని, సమాజంలో గంజాయి, డ్రగ్స్ విస్తరించిందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read :రేపు రాహుల్‌తో కలిసి సిఎం రేవంత్ పాదయాత్ర

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News