Tuesday, September 16, 2025

భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసానికి ప్రతీక బక్రీద్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : సమష్టి ప్రయోజనం కోసం వ్యక్తిగత స్వా ర్ధాన్ని విడిచి త్యాగాలకు సిద్ధపడ్డప్పుడే సమాజ హితం జరుగుతుందని, త్యా గాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అం దినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని ‘బక్రీద్ పం డుగ విశ్వ మానవాళికి అందిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. బక్రీద్ (ఈదుల్ అజ్ హా) పర్వదినాన్ని(జూన్ 29) పురస్కరించుకొని ప్రజలకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని సిఎం కెసిఆర్ అన్నారు.

సకల మత విశ్వాసాలను సాంప్రదాయాలను గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతున్నదని సిఎం అన్నారు. అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలసి జీవించేలా,గంగ జము న తహజీబ్‌ను కాపాడుకుంటూ తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరంను కొనసాగిస్తున్నామన్నారు. దేశానికే ఆదర్శవంతమైన లౌకిక ఆధ్యాత్మిక కార్యాచరణ రాష్ట్రంలో అమలవుతుందని తెలిపారు. ఇస్లాం సహా మైనారిటీ మతస్తుల అభివృద్ధి సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తుందని వివరించారు. అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని సిఎం ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News