Thursday, July 24, 2025

అప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి

- Advertisement -
- Advertisement -

బీహార్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎన్‌ఐఆర్) కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. బుధవారం అసెంబ్లీలో ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ ఎస్‌ఐఆర్‌పై చర్చిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలుగజేసుకుని ఆర్జేడీపై విమర్శలు సంధించారు. “అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి. మీ తల్లిదండ్రులు చెరో ఏడేళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అప్పటి పరిస్థితులు మీకు తెలుసా? అప్పట్లో రాత్రయితే అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఉండేది. అప్పుడు నేనూ మీతో ఉన్నాను.కానీ మీ పద్ధతి సరిగ్గా లేదు కాబట్టే నేను బీజేపీతో చేతులు కలిపా. మేము (బీజేపీ, జేడీయూ) ఇప్పుడు కలిసే ఉన్నాం. అలాగే ఉంటాం. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఏం చేయాలో ప్రజలకు తెలుసు. ’ అని నితీశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం మద్దతు ఇస్తుందన్నారు. మహిళల కోసం , మైనారిటీల కోసం ఆర్జేడీ ఏం చేసిందని ప్రశ్నించారు. తాము అన్ని వర్గాల అభివృద్ధికి పనిచేస్తున్నామన్నారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకం కాదు…
ఇక అసెంబ్లీలో తేజస్వీయాదవ్ మాట్లాడుతూ… తాము ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకం కాదని, కానీ ఆ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని, పేర్కొన్నారు. ‘ బయటనుంచి వచ్చిన ప్రజలు ఇక్కడి ఓటర్లుగా మారారని తమకు ఫిర్యాదులు అందాయని ఈసీ చెబుతుంది. 2003లో ఈ ప్రక్రియ చేపట్టారు. ఆ తర్వాత చాలా ఎన్నికలు జరిగాయి. అప్పుడే ఈ ప్రక్రియ ఎందుకు చేయలేదు. అయితే నకిలీ ఓట్లతో నితీశ్ ముఖ్యమంత్రి అయ్యారా ? మనం నకిలీ ఓట్లతో గెలిచి ఇక్కడికి వచ్చామా ? ’ అని ఆర్జేడీ నేత ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ఈ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం , ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించింది.అయితే ప్రాథమిక పత్రాలుగా ఆధార్,రేషన్ కార్డుతోపాటు స్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడీ కార్డును పరిగణన లోకి తీసుకోవాలని సూచించింది.ఈసీని అనుమానించడానికి ఏమీ లేదని, ఈ అంశంపై మరింత విచారణ జరగాల్సి ఉందని వ్యాఖ్యానించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News