Friday, September 5, 2025

క్రమశిక్షణ విషయంలో కూడా ఎక్కడా రాజీపడలేదు : మహేశ్ కుమార్ గౌడ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కామారెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కలుపుకుని పోతున్నామని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. కామారెడ్డిలో బహిరంగ సభ ఏర్పాటుకు సిఎం ఆదేశాలతో సన్నాహాలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మహేశ్ గౌడ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ నెల 15 వ తేదీకి పిసిసి పగ్గాలు చేపట్టి ఏడాది పూర్తి అయిందని, క్రమశిక్షణ విషయంలో కూడా ఎక్కడా రాజీపడలేదని తెలియజేశారు.

బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తున్నామని, కార్యకర్తలను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నామని పేర్కొన్నారు. కాళేశ్వరంపై సిబిఐ విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. సిబిఐలో కొంత లొసుగులు ఉన్నాయని అది వాస్తవం అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు వెళతామని, ఎమ్మెల్యేలు కోరుకుంటే రేవంత్ రెడ్డే మళ్లీ సిఎం అవుతారని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News