ఆంధ్రప్రదేశ్ బిజెపి ఎంపి సిఎం రమేష్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేస్తామని చెప్పలేదా? అంటూ కెటిఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కవిత అరెస్ట్ తర్వాత నా ఇంటికి వచ్చిన సంగతి మరిచావా?. బిజెపిలో బిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పలేదా?. కవితను రిలీజ్ చేస్తే బిఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని చెప్పిన మాట మరిచావా?. నా వల్లే నువ్వు ఎన్నికల్లో గెలిచావు. 300 ఓట్ల మెజారిటీతో ఎలా గెలిచావు నాకు తెలుసు. నీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి.. సంస్కారం అడ్డువచ్చి చెప్పలేదు అని సిఎం రమేష్ కీలక కామెంట్స్ చేశారు.
కాగా, అంతకుముందు తెలంగాణ ప్రభుత్వం లోన్ కు సంబంధించి కెటిఆర్ మాట్లాడుతూ.. సిఎం రమేష్, రేవంత్ కలిసి వస్తే చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా విలీనం అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ బిఆర్‌ఎస్ అని.. ఏ పార్టీలో విలీనం కాదని చెప్పారు. ఇరకాటంలో పడ్డ ప్రతిసారీ కాంగ్రెస్, బిజెపి.. ప్రజల దృష్టిమరల్చే ప్రయత్నం చేస్తున్నాయని కెటిఆర్ విమర్శించారు.