Wednesday, July 16, 2025

వ్యాక్సిన్ కింగ్ జీనోమ్ వ్యాలీ

- Advertisement -
- Advertisement -

100దేశాలకు కరోనా వ్యాక్సిన్ ఇక్కడ నుంచి సరఫరా
33శాతం వ్యాక్సిన్లు తెలంగాణ నుంచే ఉత్పత్తి.. 40శాతం బల్క్‌డ్రగ్స్ రాష్ట్రంలోనే తయారీ
బయో ఫార్మసీ రంగంలో అత్యాధునిక విధానాలు అవలంబిస్తున్న పరిశ్రమలకు ప్రోత్సాహం 

ప్రపంచదేశాలతో పోటీ పడాలన్నదే మా ఆలోచన
జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలాజిక్స్ కొత్త యూనిట్ భూమి పూజలో సిఎం

మన తెలంగాణ / హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. జినోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకే గుర్తింపును తీసుకువచ్చాయని అన్నారు. మంగళవారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్‌పేట జీనోమ్ వ్యాలీలో ఐకార్ బయాలజిక్స్ కొత్త యూనిట్‌కు ముఖ్యమంత్రి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఐటీ, ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఫార్మా, బయో సైన్సెస్ లతో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులతో ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా మారు తున్న పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులకు చైనాకు ప్రత్యామ్నాయంగా పారిశ్రామిక రంగం భారత్ వైపు దృష్టి సారించగా అందుకు అత్యుత్తమ గమ్యస్థానంగా తెలంగా ణ ఉండాలన్న సంకల్పంతో పనిచేస్తున్నామన్నారు. తెలం గాణ ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నది మా ఆలోచన. 2047 నాటికి దేశం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవ స్థగా ఎదగాలని నిర్దేశించగా అందులో తెలంగాణ నుంచి 10 శాతం మేరకు కంట్రిబ్యూట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని బయపెడు తున్న సమయంలో జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్లు తయా రు చేసి దాదాపు వంద దేశాలకు సరఫరా చేసిన సందర్భం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అన్నారు.

నేడు దేశంలో 33 శాతం వ్యాక్సిన్లు తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతుండగా 40 శాతం మేరకు బల్క్ డ్రగ్స్ ఉత్పత్తు చేస్తున్నామంటే ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వారు ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ దేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చారని ప్రశంసించారు. ఈ మధ్య కాలంలో బయో, ఫార్మసీ రంగంలో కూడా ప్రపంచంలోని అత్యాధునిక విధానాలు అవలంభిస్తున్న పరిశ్రమలను అహ్వానించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని వివరించారు. జినోమ్ వ్యాలీ పెట్టుబడుదారులకు స్వాగతం పలుకుతున్నామని, ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ప్రోత్సాహకాలను అందిస్తుందని అన్నారు. మీ మద్దతు కావాలి. పెట్టుబడులు పెట్టండి అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, శాసనసభ్యులు పి. సుదర్శన్ రెడ్డి, ఐకార్ మేనేజింగ్ డైరెక్టర్ సూదిని ఆనంద రెడ్డితో పాటు అధికారులు, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు ఐకార్ లోగో ఆవిష్కరించగా, మంత్రి వివేక్ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా తెలంగాణ
తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐ.టి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. ఈ లక్ష్య సాధనలో ‘ ఐకార్ ’ రూపంలో మరో అడుగు ముందుకు పడిందని. కొత్తగా 800 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని చెప్పారు. ఇటీవలి కాలంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్(సీఏజీఆర్) 23 శాతం. అదే సమయంలో జాతీయ సగటు కేవలం 14 శాతం మాత్రమే అన్నారు. తెలంగాణ జీఎస్డీపీలో లైఫ్ సైన్సెస్ రంగం వాటా 2.5 శాతం నుంచి 3 శాతం వరకు ఉందని, ఇది జాతీయ సగటు కంటే దాదాపు రెట్టింపు అని చెప్పారు.

‘సీబీఆర్‌ఈ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025’ నివేదిక ప్రకారం ప్రపంచంలోని అగ్రశ్రేణి లైఫ్ సైన్సెస్ క్లస్టర్ల జాబితాలో బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, టోక్యో తదితర నగరాల సరసన హైదరాబాద్ చేరిందని పేర్కొన్నారు. 2024లో హైదరాబాద్ లో 2.4 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లైఫ్ సైన్సెస్ సంస్థలు కొత్తగా అద్దెకు తీసుకున్నాయని, ఇది 2023లో 1.8 మిలియన్ చదరపు అడుగులు, 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు మాత్రమే కావడం గమనార్హం అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News