Friday, May 23, 2025

నేను ఎలాంటి తప్పు చేయలేదు: సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ తనపై పోలీసులు చేసిన ఆరోపణలు అవాస్తవాలని, తానేం తప్పు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టుకు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారని గతంలో నమోదైన కేసులో గురువారం రేవంత్ రెడ్డి నాంపల్లి మనోరంజన్ కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ బ్రేక్ చేశారని మెదక్, బేగంబజార్, నల్గొండ, మెదక్ పోలీస్ స్టేషన్‌లలో రేవంత్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా గురువారం కోర్టుకు హాజరైన రేవంత్ రెడ్డి తాను ఎలాంటి తప్పు చేయలేదని పోలీసులు చెబుతున్నవి అవాస్తవాలని ఆయన చెప్పారు.

పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ తప్పుడు కేసులు పనమోదు చేసినట్లు ఆయన కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న కోర్టు జూన్ 12న తీర్పు ప్రకటిస్తామని పేర్కొంది. కాగా, ముఖ్యమంత్రి హోదాలో కోర్టుకు హాజరుకావడం రేవంత్ రెడ్డికి ఇది రెండోసారి.మూడు కేసుల్లో వ్యక్తిగతంగా హాజరు కావాలని గతంలో కోర్టు ఆదేశించడంతో ఫిబ్రవరి 20వ తేదీన సిఎం హోదాలో మొదటిసారి కోర్టుకు సిఎం రేవంత్ హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News