Sunday, July 27, 2025

ఇప్పడన్నీ స్విగ్గీ రాజకీయాలే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రస్తుతం ఐడియాలజీ పాలిటిక్స్ కనుమరుగై స్విగ్గీ పాటిలిక్స్ వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశ రాజకీయాల్లో ధన ప్రభావం పెరిగి ప్రజాస్వామిక స్ఫూర్తికి ప్రమాదకర పరిస్థితులు త లెత్తుతున్నాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అ భిప్రాయం వ్యక్తం చేశారు. ధన ప్రభావం తగ్గి వి లువలతో కూడిన సిద్ధాంతపరమైన రాజకీయాలు ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈనాడు సిద్ధాంతపరమైన రాజకీయాలు కాకుండా ఎవరెంత వేగంగా డెలివరీ చేస్తారన్న ‘స్విగ్గీ పాలిటిక్స్’ తెరమీదకొచ్చాయని, ఇది ప్రజాస్వామ్యానికి ప్ర మాదకర పరిణామమని ఆయన పేర్కొన్నారు. హై దరాబాద్‌లో క్యాపిటల్ ఫౌండేషన్ సొసైటీ, ఇక్ఫాయ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో ఉత్తమ పార్లమెంటేరియన్ స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి పేరిట నెలకొల్పిన స్మారక అ వార్డును ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రముఖ రచయిత, ప్రముఖ ఆర్ధిక నిపుణులు మోహన్ గు రుస్వామి అందుకున్నారు. ఈ సందర్భంగా ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయాలు ఇంత స్థాయిలో దిగజారిపోతాయని ఏనాడూ ఊ హించలేదని, ప్రజాస్వామిక విలువలు తగ్గి పొలిటికల్ మేనేజ్‌మెంట్ పెరిగిందని సిఎం రేవంత్‌రెడ్డి చె ప్పారు.

సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసేవాళ్లు దేశ రాజకీయాల్లో తగ్గుతూ వస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదమని సిఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత రాజకీయాలకంటే సిద్ధాంతపరమైన రాజకీయాలు ముఖ్యమని సిఎం పేర్కొన్నారు. యూనివర్శిటీల నుంచే సిద్ధాంతపరమైన రాజకీయాలు తయారు అవుతాయని ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఆయన లేకుంటే తెలంగాణ సాకారం అయ్యేది కాదని సిఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణ కోసం జైపాల్ రెడ్డి ఎంతో చొరవ చూపారని సోనియా గాంధీ కూడా ఓసారి ఈ విషయం చెప్పారని ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ నుంచి పివి నర్సింహా రావు తర్వాత మళ్లీ అంత పేరు తెచ్చుకున్నది జైపాల్ రెడ్డి మాత్రమేనని సిఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. ముఖ్యంగా కల్వకుర్తి ప్రాంతంలో మార్పుల కోసం జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని ఆయన గుర్తుచేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కల్వకుర్తి ప్రాంతంలో విద్యుత్ అవసరమని గుర్తించి అభివృద్ధికి బాటలు వేశారని, రాజకీయాల్లో ధన ప్రవాహం తగ్గించాలని ఆయన ప్రయత్నించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

జైపాల్ రెడ్డి నమ్మిన సిద్ధాంతాన్నే తాము ముందుకు తీసుకెళ్తున్నాం
జైపాల్ రెడ్డి నమ్మిన సిద్ధాంతాన్నే తాము ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన చెప్పారు. జైపాల్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీలతో సిద్ధాంతపరంగా మాత్రమే విభేదాలు ఉండేవని, 40 ఏళ్ల పాటు అజాతశత్రువుగా కొనసాగారని సిఎ అన్నారు. సమాచార హక్కు చట్టం రావడంలో జైపాల్ రెడ్డి పాత్ర మరువలేమని, సంస్కరణల అమలుకు జైపాల్ రెడ్డి ఎంతో తాపత్రయపడేవారని ముఖ్యమంత్రి అన్నారు.

ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర
విద్యార్థి నాయకుడిగా, శాసన సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా వివిధ హోదాల్లో జైపాల్ రెడ్డి పని చేశారని సిఎం రేవంత్ అన్నారు. 1969 లో తొలిసారి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా జైపాల్‌రెడ్డి ఎన్నికయ్యారని, నాలుగుసార్లు శాసనసభ్యుడిగా, 5 సార్లు లోక్‌సభ సభ్యుడిగా, 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా జైపాల్‌రెడ్డి పనిచేశారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జైపాల్‌రెడ్డి పెట్రోలియం శాఖ నిర్వహిస్తున్న సమయంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమాచార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ప్రసార భారతి చట్టాన్ని దేశానికి జైపాల్‌రెడ్డి అందించారన్నారు.

ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర ఉండాలని జైపాల్‌రెడ్డి విశ్వసించి ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు. పార్లమెంట్ లో రాణించిన వారి నుంచి మేధావుల వరకు ఎవరితోనూ జైపాల్ రెడ్డికి వ్యక్తిగత వైరం లేదని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన వ్యక్తి జైపాల్ రెడ్డి చివరి శ్వాస వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని సిఎం రేవంత్ కొనియాడారు. జైపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడినా, తిరిగి కాంగ్రెస్ లో చేరినా సైద్ధాంతిక విభేదాలే తప్ప పదవుల కోసం ఆయన పార్టీలు మారలేదని సిఎం రేవంత్ తెలిపారు.

ఇప్పటి వరకు శాసనసభ నుంచి ఎవరినీ సస్పెండ్ చేయలేదు
ప్రతిపక్షాలు సహేతుకమైన సూచన చేస్తే తీసుకోవడానికి తనకు కూడా ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. అందుకే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఇప్పటి వరకు శాసనసభ నుంచి ఎవరినీ సస్పెండ్ చేయలేదన్నారు. దేశ రాజకీయాల్లో జైపాల్ రెడ్డి ఒక నిలువెత్తు శిఖరం అని ముఖ్యమంత్రి రేవంత్ కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News