Thursday, July 10, 2025

ఫామ్‌హౌస్‌కే వస్తా

- Advertisement -
- Advertisement -

ప్రాజెక్టులపై ఎర్రవల్లిలోనే చర్చిద్దాం అక్కడే మాక్
అసెంబ్లీ నిర్వహిద్దాం మంత్రులందరినీ పంపిస్తా
కాదు..కూడదంటే నేను కూడా వస్తా నాకేమీ భేషజాలు
లేవు.. కెసిఆర్ నాకంటే సీనియర్ ఆయన ఆరోగ్యంగా
ఉండాలి..ప్రజలకు ఉపయోగపడాలి అసెంబ్లీలో చర్చకు
వస్తానన్నా సిద్ధమే సభను హుందాగా నడుపుతానని హామీ
ఇస్తున్నా ఎవరి గౌరవానికీ భంగం కలిగించం తేదీ,
సమయం కెసిఆర్ నిర్ణయించి చెప్పాలి నదీజలాల్లో రాష్ట్ర
హక్కులను వదులుకోం నల్లగొండ, రంగారెడ్డికి గోదావరి
జలాలు తరలిస్తే ఎపి సిఎంకు అభ్యంతరమేమిటి?
మిగులు జలాలే వాడుకుంటామని చంద్రబాబు అంటున్నారు
మా వాటా మేము వాడుకున్న తరువాతే మిగులు జలాల
వాటా తేలేది దేవుడు దిగివచ్చినా.. నిటారుగా నిలబడి
తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు పోరాడుతాం
కృష్ణా నదీ జలాల ప్రజెంటేషన్‌లో సిఎం రేవంత్‌రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:కృష్ణా,గోదావరి నదీ జలాలవినియో గం, తెలంగాణ హక్కులపై కూలంకషంగా అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్‌కు అభ్యంతరం ఏదైనా ఉంటే ఆయన ఉండే ఎర్రవల్లి ఫామ్ హౌజ్ వద్దకు వెళ్లి చర్చించేందుకు త నకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఖమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తాజా గా సవాల్ విసిరారు. బుధవారం జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌లో కృష్ణా నదీ జలాల పవర్ పాయింట్ ప్ర జెంటేషన్ లో సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్షనేత హోదా లో కెసిఆర్ అసెంబ్లీ స్పీకర్ కు లేఖరాస్తే శాసనసభ సమావేశాలు ఎప్పుడైనా ఏర్పాటుచేసి చ ర్చించేందుకు సిద్దంగా ఉన్నమని స్పష్టం చేశారు. సుధీర్ఘంగా నల భై ఏళ్ల రాజకీ య అనుభవం కలిగిన కెసిఆర్ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటాం, ఆయనసూచనలు తెలంగాణకు ప్ర యోజ నం చేకూరుతాయంటే వాటిని స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సి ద్ధంగా ఉందన్నారు. నీటిపారుదల హితవుపలికారు.

“పదేండ్లు అధికారంలో కెసిఆర్ ఉన్నారు, ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలి, తేదీని ఖరారు చేయండి, మీ ఆరోగ్యం సహకరించకుంటే ఎర్రవల్లిలో చర్చపెట్టండి, మా మంత్రులను, అధికారుల ను పంపిస్తా, అదీ కూడా కాదు కూడదు అంటే ముఖ్యమంత్రిగా నేనే వస్తా” నని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఉ మ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లో ఏ ఒక్క ప్రా జెక్టునైనా పూర్తి చేశారా ? కెసిఆర్ సమాధానం చెప్పాలని సిఎం డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందన్న కెసిఆర్, తెలంగాణ ఏర్పడిన తర్వాత తన పాలనలో పెండింగ్ ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఏ ఒక్క పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం వల్లే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు రాకపోగా, ద్రోహం చేశారని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు చేసిన అన్యాయం కంటే పదేండ్ల కెసిఆర్ పాలనలో వెయ్యి రేట్లు తెలంగాణకు నష్టం జరిగిందని దుయ్యబట్టారు. దీనికి శిక్షించాల్సిన పరిస్థితి వస్తే ఉమ్మడి రాష్ట్ర పాలకులను ఒక్క కొరడా దెబ్బ కొట్టాల్సి వస్తే, పదేండ్లు పాలించిన కెసీఆర్ ను వంద కొరడా దెబ్బలు కొట్టాల్సి వస్తుందన్నారు.

మాపై బురదచల్లే ప్రయత్నం
రాష్ట్రానికి రావాల్సిన నీటి హక్కుల కోసం తమ ప్రభుత్వం పోరాటం చేస్తుంటే తమనిజాయితీపై బురద చల్లే ప్రయత్నం బిఆర్‌ఎస్ నాయకులు చేస్తున్నారని సిఎం మండిపడ్డారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవని గతంలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ఆ విధంగా ఆయన ఎలా మాట్లాడుతారని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అంతర్జాతీయ జలవిధానం ప్రకారంగా ఒక బేసిన్‌లో అవసరాలు తీరిన తర్వాతనే మరొక బేసిన్‌లోకి నీటిని తీసుకువెళ్లాలని చెబుతోందన్నారు. పక్కరాష్ట్రం పక్షాన వకాల్తా పుచ్చుకోవడానికి కెసిఆర్ ఏమైనా వారికి పాలేరుగా మారారా ? అని సిఎం నిలదీశారు. గోదావరి నదిపై ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టారని, దానికి దివంగత కేంద్ర మంత్రి వెంకటస్వామి కోరిక మేరకు ఆ ప్రాజెక్టుకు డాక్టర్ అంబేద్కర్ పేరు ప్రతిపాదించారని తెలిపారు.

అయితే బిఆర్‌ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఆయకట్టు తొలగించడంతో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు తగ్గిందని వివరించారు. గోదావరి జలాలలను ఏపీ తరలించుకుపోవడానికి బేసిన్లు, భేషజాలు లేవని చెప్పిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, కృష్ణా బేసిన్ కు అనుకుని ఉన్న గోదావరి జలాలను రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు నీరు తరలించకుండా ఎందుకు ఆయకట్టు తొలగించారో ఆయన దీనికి సమాధానం చెప్పాలని సిఎం డిమాండ్ చేశారు. ఎపి వాళ్ల మెప్పు కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టారని సిఎం ఆరోపించారు. ఆనాడు వాళ్లు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు రోడ్డెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా అని మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్ హయాంలో 54 లక్షల ఎకరాలకు నీళ్లిస్తే ఒక ఎకరాకు అయిన ఖర్చు రూ.93 వేలు కాగా, బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో 15 లక్షల ఎకరాలకు నీళ్లిస్తే ఒక ఎకరాకు నీళ్లివ్వడానికి వాళ్లు చేసిన ఖర్చు రూ.11లక్షలు అని సిఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.

వారిది వితండవాదం
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలోనే రాష్ట్రం సర్వం నాశనమైంది అన్నట్లు, మళ్లీ వాళ్లు అధికారంలోకి వస్తేనే బాగుపడుతుందన్నట్టు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఒక వితండవాదన తీసుకొస్తున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై చట్టసభల్లో చర్చిద్దామని సూచన చేస్తే సమాధానం లేదన్నారు. కానీ సడన్ గా ఆయనగారు(కెటిఆర్) వచ్చి ఏదేదో మాట్లాడారు, అలాంటి మాటలకు తాను ఎలా సమాధానం చెబుతానో అందరికీ తెలుసు కానీ, వారిలా ఆ స్థాయికి నేను దిగజారలేను అని సిఎం అన్నారు.

హైదరాబాద్ అవసరాలను చర్చించలేదు
రాజధాని హైదరాబాద్ నగరంలో 20 శాతం ఆంధ్రా ప్రజలు ఉన్నారని, ఆ కోణంలోనైనా కెసిఆర్ హైదరాబాద్ నీటి అవసరాలను చర్చించకపోవడం విచారకరమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శాశ్వతంగా కృష్ణా పరివాహక ప్రాంత రైతులకు మరణశాసనం రాసే అధికారం కేసీఆర్ కు ఎవరూ ఇవ్వలేదన్నారు. జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డికి నీటిని తరలించుకుంటే ఏపీకి అవకాశం ఉండేది కాదన్నారు. తెలంగాణలోకి ప్రవేశించిన వెంటనే కృష్ణా నీటిని ఒడిసిపట్టుకుని ఉంటే రాయలసీమకు నీరు తరలించుకు వెళ్ళే అవకాశం ఉండేది కాదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011 సంవత్సరంలో పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లో సాగునీరు,

తాగునీరు సమస్య ఉందన్నప్పుడు అప్పటి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి సర్వేకు ఆదేశించారని తెలిపారు. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని తరలించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. తెలంగాణ సరిహద్దుల్లోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోకి వచ్చిన కృష్ణా నీటిని ఒడిసి పట్టుకోకుండా ఆ నీళ్లు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి వెళ్లడంతో అక్కడి ప్రాజెక్టుల నిర్మాణాలకు సహకరించింది బిఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా అని సిఎం ప్రశ్నించారు. ఆనాడు అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సూచించిన ప్రకారం జూరాల నుంచి తెలంగాణకు నీళ్లు తెచ్చుకుని ఉంటే ఈనాడు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యేవి కాదన్నారు. తెలంగాణ ప్రజలకు కెసిఆర్ హయాంలో మరణశాసనం రాశారని, విద్యుత్ పరంగా జల విద్యుత్ ఉత్పత్తికి తీవ్రనష్టం వాటిల్లడానికి కూడా కారకులు వారేనని సిఎం ఆరోపించారు.

తెలంగాణ వాటాలు తేలాలి
మిగులు వరద జలాలను తీసుకెళ్తే అభ్యంతరం ఏమిటని ఎపి సిఎం అంటున్నారు కానీ, వరద జలాల్లో, ఎపి, తెలంగాణ వాటాల లెక్కలు తేల్చాల్సిన అవసరం లేదా అని సిఎం ప్రశ్నించారు. నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల మీద ఏపి, తెలంగాణ రాష్ట్రాలకు ఉన్న హక్కుల మీద మాట్లాడుకుందామని చంద్రబాబు నాయుడుకు సూచించారు. తెలంగాణ ప్రజల తరపున నిలబడే బాధ్యత మాది, మా మంత్రి వర్గానిది అని పునరుద్ఘాటించారు.

కుల పెద్దల సమక్షంలో మీ సమస్య
మీ కుటుంబంలో సమస్య ఉంటే కుల పెద్దల సమక్షంలో పంచాయితీని తేల్చుకోండి అంతే కానీ, ఈ వీధి బాగోతాలు ఎందుకు ? ఇది మంచి పద్దతి కాదు అని సిఎం హితవు పలికారు. ఈ సందర్భంగా నేపాల్ రాజకుటుంబంలో కాల్పులఘటనను ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
మేం క్లబ్బులకు, పబ్బులకు దూరం
తనది పబ్బులు, క్లబ్బుల సంసృతి కాదని, వాటికి నేను దూరమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాస్తవాలను ప్రజలకు అందించడమే తమప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. ప్రజా భవన్ లో సమావేశం ఏర్పాటు చేస్తే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మా మంత్రి శ్రీధర్ బాబుకు ఫక్షన్ చేసి అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గడీ కాదు, ఇది ప్రజా భవన్, సమస్యలు చెప్పుకోవడానికి ఎవరైనా ఇక్కడికి రావచ్చు అని తెలిపారు.

హక్కులను ఎవరికీ తాకట్టు పెట్టం
తెలంగాణ హక్కులను తాము ఎవ్వరికీ తాకట్టు పెట్టమని సిఎం స్పష్టం చేశారు. ఈ విషయాలలో దేవుడు ఎదురొచ్చినా నిటారుగా నిలబడి పోరాడుతామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News