Wednesday, May 21, 2025

వికారాబాద్ జిల్లా రోడ్డు ప్రమాదంపై సిఎం సంతాపం

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ జిల్లా రంగాపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స, తక్షణ సహాయక చర్యలను అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలియజేశారు. కాగా, వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం రంగాపూర్ సమీపంలో ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న వారిలో నలుగురు మృతి చెందగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులు పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News