Saturday, August 2, 2025

హస్తిన యాత్రల్లో అర్ధశతకం సాధించిన రేవంత్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ యాత్రల్లో రేవంత్ రెడ్డి హాఫ్ సెంచరీ పూర్తి చేశారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. అధికారంలో వచ్చిన 20 నెలల్లో 50 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డితో రాష్ట్రానికి పైసా ప్రయోజనం కలగలేదని చెప్పారు. ఢిల్లీ బాసుల కాళ్ల దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఫైల్స్‌తో కాకుండా ఫ్లైట్ బుకింగ్స్‌తో రాష్ట్రాన్ని పాలిస్తున్న రేవంత్ రెడ్డి టూరిస్ట్ సిఎంగా దేశ చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. ఫ్లైట్ టికెట్‌లు బుక్ చేసుకోవడం, ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేయడం, వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో ఊపుకుంటూ రావడం అనే మూడు పనులను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి పట్టుదలతో చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

పాలించే ముఖ్యమంత్రి కావాలి కానీ, ఢిల్లీకి విహార యాత్రలు చేసే టూరిస్ట్ సిఎం అవసరం లేదరి అన్నారు. ముగ్గురు యజమానుల ముద్దుల బానిస అయిన రేవంత్ రెడ్డి తన మొదటి బాస్ రాహుల్ గాంధీకి నోట్ల కట్టల మూటలు మోస్తూ పదవిని కాపాడుకుంటున్నారని ఆరోపించారు. రెండో యజమాని మోడీ కి సన్నిహితులైన వ్యాపారవేత్తలకు తెలంగాణ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి కేసుల నుంచి తప్పించుకుంటున్నారని, ఇక మన అన్నదాతల కడుపు కొట్టి తెలంగాణ జల సంపదను తన మూడో యజమాని చంద్రబాబుకు దోచి పెడుతున్నారన్నారని పేర్కొన్నారు. తెలంగాణ సోయి లేని రేవంత్ రెడ్డి బానిస మనస్తత్వంతో త్యాగాల పునాదులపై పురుడు పోసుకున్న తెలంగాణ నిలువు దోపిడికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News