Wednesday, September 3, 2025

కెసిఆర్ పాలమూరుకు సముచిత న్యాయం చేయలేదు: రేవంత్

- Advertisement -
- Advertisement -

మూసపేట: పాలమూరు జిల్లా ఒకనాడు వలసలకు మారుపేరు అని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మూసపేటలో సిఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పాలమూరు బిడ్డల భాగస్వామ్యం లేకుండా ఏ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదని పేర్కొన్నారు. ‘‘చదువు, నీళ్లు జిల్లా ప్రజలకు అందుబాటులో లేక వలసలు పోయారు. కృష్ణా జలాలు పక్క నుంచి వెళ్తున్నా తాగు, సాగు నీటి సమస్యలు ఉన్నాయి. సమస్య పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో పాలమూరు జిల్లా అండగా నిలిచింది. కెసిఆర్ మహబూబ్‌నగర్ ఎంపిగా గెలిపించారు.’’ అని సిఎం అన్నారు.

కెసిఆర్‌ను ఎంపిగా గెలిపించినా తమ ప్రాంతానికి సముచిత న్యాయం జరగలేదని సిఎం రేవంత్ (Revanth Reddy) మండిపడ్డారు. ‘‘గత ప్రభుత్వ హయాంలో పలు ప్రాజెక్టులు సంపూర్ణంగా పూర్తి కాలేదు. పేరుకే పాలమూరు వర్సిటీ అయినా.. పిజి కాలేజీగానే మిగిలింది. చదువు, ఉపాధి, నీటిపారుదలలో జిల్లాను అభివృద్ధి చేసుకోవాలి. ప్రణాళికలు రచించుకోకపోతే జిల్లాకు శాశ్వతంగా అన్యాయం జరుగుతుంది. జిల్లాకు ట్రిపుల్‌ ఐటీని మంజూరు చేసుకున్నాం. 14 అసెంబ్లీ స్థానాల్లో యంగ్ ఇండియా స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి జిల్లా వేదిక కాబోతోంది’’ అని సిఎం స్పష్టం చేశారు.

Also Read : రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News