- Advertisement -
హైదరాబాద్: కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం అల్లకల్లొలం అవుతోంది. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. దీని వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయి.. అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాగా, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సిఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నగరంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. మైత్రివనం, బల్కంపేట్‌లో సిఎం పర్యటించి అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైడ్రా కమీషనర్ రంగనాథ్‌తో కలిసి అమీర్‌పేట్ గంగుబాయి బస్తీలో పర్యటించిన సిఎం.. బుద్ధనగర్‌లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. బస్తీ వాసుల సమస్యలను పరిష్కరిస్తామని సిఎం హామీ ఇచ్చారు.
- Advertisement -