- Advertisement -
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం బిజి..బిజీగా గడిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా సంఘీభావంగా ఆయన సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. అనంతరం పార్టీ ఎంపీలతో కలిసి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిసారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిన్నందున ఇతోధికంగా సహాయం చేయాలని కోరారు.
- Advertisement -