మన తెలంగాణ/హైదరాబాద్ : బల్దియా అధికారులు, హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎక్కడా నీరు నిలిచిపోకుండా, వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాధ్‌కు సూచించారు. ఆదివారం నగరంలోని ముంపు ప్రాంతాల్లో సీ ఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. మైత్రీవనం, బల్కంపేట, అమీర్ పేట గంగూబాయి బస్తీల్లో రేవంత్ పర్యటించి స్థానికులతో మాట్లాడారు. కాగా లోతట్టు ప్రాంతాలు, బస్తీ ల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్కంపేటలో, గంగూబాయి బస్తీలో స్థానికుల సమస్యలు అ డిగి తెలుసుకుని, వాటిని పరిష్కరించాలని సూచించారు. వరదనీరు నిలవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులకు ప లు కీలక సూచనలు చేశారు. గత వారం రోజులుగా నగరాన్ని భారీ వర్షాలు ముంచేస్తున్న సంగతి తెలిసిందే. క్లౌడ్ బరస్ట్ కావడంతో నగరంలో కుండపోత వానలు కురిసి, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. ము ఖ్యంగా మూసీనది, నాలాల పరివాహక ప్రాం తాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లే కుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ న గరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇతర అధికారులతో కలిసి అమీర్‌పేట్, మైత్రీవనం ప్రాం తాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మై త్రివనం దగ్గరలోని గంగుబాయి బస్తీలో ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి బస్తీవాసుల ను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. బస్తీవాసులు తమ సమస్యలను రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నారు. వరద వల్ల రాత్రంతా మెలకువతోనే ఉన్నామని ఆయనకు వివరించారు. బు ద్ధనగర్‌లో డ్రైనేజీ వ్యవస్థను రేవంత్ రెడ్డి పరిశీలించి వాటిని పరిష్కారిస్తామని ప్రజలకు హా మీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముంపు ప్రాం తాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి సీఎం పరిశీలించారు. బల్కంపేట ముంపు ప్ర భావిత ప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలను హైడ్రా కమిషనర్, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు.
బుద్ధనగర్ ప్రాంతంలో కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండడంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతుందని గమనించిన ముఖ్యమంత్రి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని అధికారులరను ఆదేశించారు. అనంతరం సమస్యలపై క్షేత్రస్థాయి అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు. అమీర్‌పేట బుద్ధనగర్‌లో జశ్వంత్ అనే బాలుడితో ముఖ్యమంత్రి వివరాలు ఆరా తీశారు. బాలుడిని వెంటపెట్టుకుని ఆ ప్రాంతాన్ని కలియ తిరిగారు. తాను 7వ తరగతి చదువుతున్నానని, వరద నీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని ఆ బాలుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి బాలుడికి ధైర్యం చెప్పారు. ఆయా ప్రాంతాలను పరిశీలించిన తరువాత ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన చర్యలపై జీహెచ్‌ఎంసి కమిషనర్, హైడ్రా కమిషనర్లకు, సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు ఆదేశాలు జారీ చేశారు.
అవసరమైతే తప్ప బయటకు రావద్దు :
మరోవైపు భారీ వర్షాలు ఉన్నాయనే సమాచారం నేపథ్యంలో హైడ్రా సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. వరద నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని రంగనాథ్ ఆదేశించారు. మ్యాన్‌హోల్స్, విద్యుత్ స్తంభాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావద్దని ఆయన సూచించారు.