Monday, July 14, 2025

ఉజ్జయిని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఉజ్జయిని అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సంతోషంగా జీవించాలని కోరుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉదయం 11 గంటల ప్రాంతంలో దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్టం తరపున పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, దానం నాగేందర్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రాకతో భక్తులను కాసేపు నిలుపుచేశారు. భక్తులకు అభివాదం చేసుకుంటూ అమ్మవారిని దర్శించుకొని వెళ్లిపోయిన తరువాత తిరిగి భక్తులు యదావిధిగా అమ్మవారిని దర్శించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News