Monday, September 1, 2025

సిబిఐ విచారణకు కేంద్రానికి లేఖ రాస్తాం: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సిబిఐ విచారణ జరిపించాల్సిందిగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఉప రాష్ట్రపతి పదవికి ‘ఇండి’ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం తన మంత్రివర్గ సహచరులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పరిచయం చేశారు. సమావేశానంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సిబిఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాశారా? అని ప్రశ్నించగా, రాత్రి రెండింటి వరకూ అసెంబ్లీలో ఉన్నామని, సిబిఐకి లేఖ రాయడానికి సమయం ఎక్కడిదని ఆయన ఎదురు ప్రశ్నించారు. అయినా అది తమ అధికారులు చూసుకుంటారని అన్నారు. సిబిఐ విచారణ జరిపేందుకు రాష్ట్రానికి రాకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వం నిషేధం విధించింది కదా?, దానిని ఎత్తివేస్తారా?

అని ప్రశ్నించగా, నిషేధం అంటూ ఏమీ ఉండదని అన్నారు. అంశాల వారీగా లేఖ రాస్తే అందుకు కేంద్రం సమ్మతిస్తుందన్నారు. బిజెపిని ఫిక్స్ చేయడానికే సిబిఐ విచారణ నిర్ణయం తీసుకున్నారా? అని ప్రశ్నిం చగా, అదేలా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు. సకాలంలో సిబిఐ విచారణ చేపట్టి చర్యలకు ఉపక్రమిం చకపోతే, బిజెపి, బిఆర్ఎస్ కలిసే ఉన్నాయన్న సంకేతాలు పంపేందుకేనా?, బాల్ను వాళ్ళ కోర్టులోకి నెట్టే సారా? అని ప్రశ్నించినా, ఆయన ‘వాళ్ళు’ ఎవరూ? అంటూ సమాధానం చెప్పకుండా దాట వేశారు. సిబిఐ విచారణ పూర్తి చేసేందుకు ఎంత గడువు కోరుతారని ప్రశ్నించగా, గడువు గురించి తాము ఎలా చెప్పగలమని ముఖ్యమంత్రి అన్నారు.

ఇదిలాఉండగా కాళేశ్శరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఆది వారం అసెంబ్లీలో రాత్రి బాగా పొద్దుపోయేంత వరకూ చర్చ జరిగడం, సిబిఐ విచారణకు అప్పగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై నేడో, రేపో గెజిట్ నోటిఫికేషన్ ను ప్రభుత్వం విడుదల చేయను న్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News