Friday, July 25, 2025

సడక్ సే సంసద్ తక్

- Advertisement -
- Advertisement -

బిసిలకు 42శాతం రిజర్వేషన్ల సాధనకు
కాంగ్రెస్ వ్యూహం అసెంబ్లీలో
మద్దతిచ్చి కేంద్రంలో అడ్డుకుంటున్న
బిజెపి బిజెపి నేతలది వితండవాదం
మతం ప్రాతిపదికన మేం రిజర్వేషన్లు
ఇవ్వడం లేదు సామాజిక, ఆర్థిక
వెనుకబాటే ప్రాతిపదిక దమ్ముంటే
ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం
రిజర్వేషన్లు ఎత్తివేయాలి ఇడబ్లుఎస్
రిజర్వేషన్లను పార్లమెంట్ ఆమోదించిన
నాడే 50% పరిమితి తొలగిపోయింది
స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల
నిబంధన తొలగించే యోచన
బిసిలంటే బిజెపికి చిన్నచూపు
దత్తన్నకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి
బిఆర్‌ఎస్ పాలనలో సొంత కుటుంబ
సభ్యుల ఫోన్లనే ట్యాప్ చేసుకున్నారు
ఇంతకన్నా చావడం మేలు ఢిల్లీలో
విలేకరుల సమావేశంలో
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడి తరగతులు(బిసి)లకు విద్య, ఉ ద్యోగ రంగాలు, స్థానిక సంస్థల్లో 42 శా తం మేరకు రిజర్వేషన్లు అమలు చేసే దిశ గా కార్యాచరణ రూపొందించుకున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. వీటి కోసం “సడక్ సే సంసద్ తక్‌” దిశగా పోరాడుతామన్నారు. ఈ అంశంపై గురువారం లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నా యకుడు మల్లికార్జున్ ఖర్గేలను కలిసి బిసి రిజర్వేషన్ల అమలుకు కార్యాచరణ రూ పొందించుకుంటామన్నారు. అవసరమైతే కాంగ్రెస్ మిత్రపక్షాలను ఏకం చేసి కేం ద్రంపై ఒత్తి తీసుకువస్తామన్నారు. బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న సిఎం రేవంత్ రెడ్డి సాయంత్రంం ఎంపీలతో కలి సి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా బిసి రిజర్వేషన్ల అమలుపై త మ పార్టీ పెద్దలతో చర్చించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు తెలంగాణలో ని ర్వహించిన కులగణనకు సంబంధించి పవ ర్ పాయింట్ ప్రజెంటేషన్(పిపిపి) ఇస్తామన్నారు.

బిజెపి నాయకులు రాష్ట్రంలో ఒకతీరుగా, కేంద్రంలో మరొక తీరుగా వ్యవహరిస్తున్నారని సిఎం మండిపడ్డారు. బిసి రిజర్వేషన్లకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన బిజెపి కేంద్రంలో తిరిగి వారే అడ్డుకునే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బిసి రిజర్వేషన్లను ఏవిధంగానైనా సరే అడ్డుకోవాలన్న దురుద్దేశ్యం వారిలో స్పష్టంగా కనిపిస్తుందన్నారు. తమ ప్రభుత్వం శాసనసభ బిసి రిజర్వేషన్లపై రెండు తీర్మానాలను ఆమోదించి కేంద్రానికి పంపించిందని, అయితే కేంద్ర వాటిని ఆమోదించకుండా తాత్సారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లకు యాబై శాతం పరిమితి మించకూడదనే పరిమితికి ఎప్పుడో కాలం చెల్లిందన్నారు. ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు పది శాతం ఎప్పుడైతే పార్లమెంటులో ఆమోదించిందో అప్పటి నుంచే పరిమితి తొలిగి 60 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని తెలిపారు. జనగణనలో కులగణన చేర్చాలని సిఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందని తెలిపారు. తమను చూశాకే కేంద్రం జనగణన చేపట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ దేశ ప్రజలకు హామీని తెలంగాణలో తమ ప్రభుత్వం అమలుచేసి చూపించిందన్నారు.

కేంద్రంపై ఒత్తడికి కార్యాచరణ
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఒక కార్యాచరణ తీసుకున్నామని, అందుకు ప్రతిపక్ష నేతలను, ఇండియా కూటమి నేతలను కలుస్తామని సిఎం చెప్పారు. దశాబ్దాలుగా అణిచివేతకు గురవుతున్న బిసిలకు మేలు చేయాలన్నదే తమ సంకల్పమని తెలిపారు. తెలంగాణ హైకోర్టు నెల రోజుల్లోగా రిజర్వేషన్లు ఖరారు చేసి తొంబై రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తిచేయాలని ఆదేశించినట్లు చెప్పారు.

బిజెపిది వితండవాదం
బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై జాతీయ స్థాయిలో బిజెపి ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమిని నిలదీయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీలో బిజెపి కూడా ఏకగ్రీవ తీర్మాణానికి మద్దతు ఇచ్చిందని, బిజెపి కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం తాజాగా వితండవాదం చేస్తున్నారని విమర్శించారు. బిసిలకు రిజర్వేషన్లు అని హామీ ఇచ్చిన వారే అమలుచేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వాదిస్తున్నారని, బిజెపి వాళ్లకు, కాంగ్రెస్ వాళ్లకు వేర్వేరు రాజ్యాంగాలు ఉంటాయా అని ఆయన నిలదీశారు. బిసి రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తొలగిస్తేనే తాము మద్దతిస్తామని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. అయితే బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఈబిసిలకు కల్పించిన రిజర్వేషన్లలో

ముస్లిం కులాలు లేవా అని సిఎం సూటిగా ప్రశ్నించారు. రిజర్వేషన్ల ఎప్పుడూ మతాల ప్రాతిపదికన ఉండవని, వాటిని సామాజిక, ఆర్ధిక వెనుకబాటుతనం ఆధారంగా ఉంటాయని గుర్తుచేశారు. ఈ ప్రాతిపదిక మేరకే బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ల్లో ఎప్పటి నుంచో రిజర్వేషన్లు అమలు అవుతున్నాయన్నారు. బిజెపి మూలాలు ఉన్న ఉన్న రాష్ట్రాలు, ఆర్‌ఎస్‌ఎస్ కేంద్ర కార్యాలయం మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రాష్ట్రంలో గుజరాత్ లో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర ప్రదేశ్‌లో వారి రిజర్వేషన్ల తొలగించిన తర్వాత మమ్ముల్ని ప్రశ్నించండి అని ఆపార్టీ నేతలను ముఖ్యమంత్రి నిలదీశారు. ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించిన అమిత్ షాను బిజెపి పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వితండవాదం చేస్తే తెలంగాణలో బిజెపిని ప్రజలు రాష్ట్రం నుంచి పూర్తిగా తుడిచివేస్తారన్నారు.

అడ్డుకునే వారికే అనుమానాలు
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు లేవని, బిసి రిజర్వేషన్లు అడ్డుకునే వారికే అనుమానాలు ఉన్నాయని సిఎం వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వేలు మొత్తాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ చేశామని, వ్యక్తుల సమాచారాన్ని బహిరంగ పరచకూడదు నిబంధన మేరకు వాటిని పబ్లిక్ డొమెన్‌లో పెట్టడంలేదని స్పష్టం చేశారు. కమిషన్ ఇచ్చిన నివేదికపై ఎక్స్‌పర్ట్ కమిటిని నియమించామని, సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో ఈ కమిటీ తమ నివేదిక ఇచ్చిందన్నారు. ఈ నివేదికను మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి శాసనసభలో ప్రవేశపెట్టి చర్చిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం బిసిలు 56.4 శాతం, ఎస్సీలు 17.45 శాతం, ఎస్టీలు 10.08 శాతం, ఓసిలు 10.09 శాతం ఉండగా, 3.09 శాతం ప్రజలు మాకు ఏ కులం లేదు అని వెల్లడించారని సిఎం వివరించారు.
ఇద్దరు పిల్లల నిబంధన తొలగించే యోచన
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు సంతానం కలిగిన వారు మాత్రమే పోటికి అర్హులని ప్రస్తుతం ఉన్న నిబంధనను తొలగించాలని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.

వెనుకబాటు తనమే ప్రాతిపదిక
రాష్ట్ర ప్రభుత్వానికి వెనుకబాటు తనమే రిజర్వేషన్లకు ప్రాతిపదిక తప్ప మతం కాదు అని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బిసిల్లో ఎ,బి,సి,డి గ్రూప్‌లతో పాటు ఈ గ్రూప్ అనేది వెనుకబాటు తనానికి సంబంధించిన రిజర్వేషన్ మాత్రమేనని తెలిపారు. అందులో ముస్లింలలో అట్టడుగువర్గాలకు చెందిన దూదేకుల కులస్తులకు రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని 87 కులాల్లో 38 ముస్లిం ఉప కులాలు రిజర్వేషన్లు పొందుతున్నాయని, యుపి లో 5 ముస్లిం ఉప కులాలు, గుజరాత్‌లో 28 ఉపకులాలు రిజర్వేషన్లు పొందుతున్నారని, వీటిని బీహార్, మహారాష్ట్రలో రిజర్వేషన్లు అనుభవిస్తున్న మాట వాస్తవం కాదా అని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
మా వ్యూహం మాకుంది
బిసి రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుంటే మాకు వ్యూహం ఉందని సిఎం అన్నారు. రైతు వ్యతిరేక చట్టాలపై ప్రధానితోనే రైతులకు క్షమాపణ చెప్పించామని, తెలంగాణలో కులగణన విజయవంతంగా పూర్తిచేస్తే గతంలో కేంద్రం కులగణన చేయమన్నారు, ఇప్పుడు చేస్తామని ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని సిఎం గుర్తుచేశారు. ఫిబ్రవరి 14న సోషల్ జస్టీస్ డే గా జరుపుకుంటున్నట్లు తెలిపారు.

ఇది వ్యక్తి కోసం కాదు జాతి కోసం
బిసి రిజర్వేషన్లు వ్యక్తి కోసం కాదని, జాతి కోసమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేంద్రం నిరాకరిస్తే విపక్షాలను ఏకం చేసి లోక్ సభ, రాజ్యసభలో ఒత్తిడి తీసుకువచ్చేందుకు కార్యచరణను రూపొందిస్తామన్నారు. మండల్ కమిషన్ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, దేశంలో 1931లో కులాల సర్వే జరిగిందని, ఆతర్వాత వాటిని చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వచ్చే రోజుల్లో కేంద్రానికి ఎలాంటి జవాబు చెప్పాలో మాకు తెలుసునన్నారు. ఓబిసి రిజర్వేషన్లకు 2029 లోక్ సభ ఎన్నికలు లిట్మస్ టెస్ట్ కానున్నాయని ఆయన అభివర్ణించారు.

బిసిలకు కేసిఆర్ ద్రోహం
రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతానికి పరిమితం చేస్తూ గతంలో కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని బిసిలకు ద్రోహం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. 2018 సంవత్సరంలో రాష్ట్రంలో 50 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారని, దానిని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపించినట్లు తెలిపారు. తొంబై రోజుల్లోగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాల నేపధ్యంలో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిందన్నారు. ఆర్డినెన్స్‌కు, విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం బిసి రిజర్వేషన్లకు వివాదం, చిక్కు లేదు అని సిఎం స్పష్టం చేశారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల ఖరారు అయ్యాక, సబ్ కాస్ట్ రిజర్వేషన్లు ఖరారు చేస్తామని సిఎం వివరించారు. ఆర్డినెన్స్ విషయంపై గవర్నర్ వివరణ అడిగారు, దానికి సమాధానం ఇస్తామన్నారు.
వారివి కోతి చేష్టలు
రాష్ట్రంలో ప్రతిపక్షానికి నాయకుడు లేడు, ఆయన పిల్లలకు(కెసిఆర్) కోతికి కొబ్బరి చిప్పలు దొరికినట్లు ఎగురుతున్నారని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను చెడిన కోతి వనమల్లా చెడుతుందన్నట్లుగా బిఆర్‌ఎస్ నేతల వ్యవహారశైలి ఉందని విమర్శించారు.

దత్తన్నకు ఉపరాష్ట్రతి పదవి ఇవ్వాలి
ఉపరాష్ట్రపతి ధన్‌కడ్ రాజీనామా విచారకరమని సిఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఖాళీ అయిన ఈ పదవిని దక్షణాది వ్యక్తికి ఇవ్వాలని కోరారు. దక్షణాది నుంచి వెంకయ్యనాయుడుకు రాష్ట్రపతి ఇవ్వకుండా అన్యాయం చేశారని, ఇప్పుడు హర్యాన గవర్నర్‌గా బండారు దత్తత్రేయ తొలగించారు. గతంలో దత్తత్రేయను తొలగించి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. అలాగే బిసి సామాజికవర్గానికి చెందిన బండి సంజయ్ ను తొలగించి ఓసి అయిన రామచంద్రారావు కు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చి బిజెపి బిసి వ్యతిరేక పార్టీగా మారిందని సిఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బిసిల పట్ల బిజెపి కుట్ర లను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. దేశంలో హిందీ తర్వాత తెలుగు బాష మాట్లాడే ప్రజలు ఎక్కువ మంది ఉన్నారని, దక్షణాది నుంచి తెలుగువాడైన మంచి వ్యక్తి, సీనియర్ నాయకుడు దత్తత్రేయకు ఉపరాష్ట్ర పతి ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇది తాను ఇండియా పక్షాన చేయడం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల పక్షాన దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని తాను కోరుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో బిసిలకు బిజెపి చేసిన అన్యాయాన్ని దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గౌరవించాలని ప్రధానిని కోరుతున్నానని తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్ పై సిఎం కీలక వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ అంశంపై సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కీలకవ్యాఖ్యలు చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత మీడియాతో ఆయన చిట్ చాట్ చేస్తూ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కుటుంబసభ్యుల సంభాషణలు కూడా విన్నారని, సొంత కుటుంబసభ్యుల ఫోన్లే ట్యాప్ చేసి వినాల్సి వస్తే అంతకంటే సూసైడ్ చేసుకోవడం మంచిదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కాదని, కానీ లీగల్‌గా పర్మిషన్ తీసుకుని చేయాల్సి ఉంటుందన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై మొట్ట మొదటి సారిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిందే ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ అని సిఎం గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ కొనసాగుతుందని, దీని కోసం సిట్ ఏర్పాటు చేశానని, విచారణ వారు చేస్తున్నారే తప్ప వారికి తాను డిక్టేట్ చేయడంలేదన్నారు. తన ఫోన్ ట్యాపింగ్ కాలేదనే అనుకుంటున్నా& ఒక వేళ ట్యాప్ చేసినట్లయితే విచారణకు తనను కూడా పిలిచేవారని, వారు పిలిస్తే విచారణకు హాజరవుతానని తెలిపారు. సెంట్రల్ వర్సిటీ భూములను తాను తాకట్టు పెట్టలేదన్నారు. కెసిఆర్ కూతురు కవిత పంచాయతీ అంతా ఆస్తులు, అధికారానికి సంబంధించిందేనని తోసిపుచ్చారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు సుప్రీం కోర్టు సలహా మాత్రమే ఇవ్వొచ్చని, ఆదేశించలేదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News