Monday, September 8, 2025

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మాణంపై మహా సిఎంతో చర్చిస్తా: రేవంత్

- Advertisement -
- Advertisement -

తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు విషయంపై త్వరలో మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో మాట్లాడుతానన్నారు. సోమవారం గోదావరి తాగునీటి పథకంలో భాగంగా ఫేజ్-2, ఫేజ్‌-3 పనులకు సిఎం రేవంత్‌ శంకుస్థాపన చేశారు. ఈ పథకంతో హైదరాబాద్‌కు మరో 20 టీఎంసీల గోదావరి జలాలు రానున్నాయి. రూ.7,360 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించనున్నారు. శంకుస్థాపన అనంతరం సిఎం మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్లతో రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయాలనుకున్నామని, తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణంపై త్వరలో మహా సిఎంతో చర్చిస్తానని చెప్పారు. మూసీనది ఎల్లకాలం మురికి కూపంగానే ఉండాలా?.. గంగా, యమునా, సబర్మతీ నదులు మాత్రమే ప్రక్షాళన కావాలా? అని సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. నల్గొండ ప్రజల కోసం మూసీని ప్రక్షాళన చేసి తీరుతామని సిఎం స్పష్టం చేశారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News