Saturday, September 13, 2025

పది టిఎంసిల నీటిని ఏపి మళ్లీస్తోంది: సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. గడిచిన పదేళ్లలో అధికారంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో న్యాయపరంగా రావాల్సిన నీటి కోటా సాధించటంలో దారుణంగా విఫలమైందన్నారు. కృష్ణాపై తలపెట్టిన పాలమూరు నుంచి డిండి వరకు ప్రాజెక్టు లను పెండింగ్‌లో పెట్టిందని, నీటి వాటాల విషయంలో తీరని ద్రోహం చేసిందన్నారు. దిగువ రాష్ట్రాల హక్కులతో పాటు నదీ వాటాల పంపిణీ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు కృష్ణాలో 904 టిఎంసీల నీటి వాటా రావాల్సి ఉందని, అందుకు అనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని సిఎం స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉదాసీనంగా వ్యవహారించడంతో ఏపి ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిందని, ఆ విషయాన్ని ట్రిబ్యునల్ ముందుకు తీసుకురావాలని సిఎం చెప్పారు. శ్రీశైలం రిజర్వాయర్ నిండకముందే, పోతిరెడ్డిపాడు నుంచి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ద్వారా రోజుకు పది టిఎంసిల నీటిని ఏపి మళ్లీస్తుందని, ఇతర బేసిన్‌లకు తరలించుకుపోతోందన్నారు.

Also Read: 68 జిఓను రద్దు చేసి హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News