Sunday, August 17, 2025

నచ్చనోళ్లపై అధికారాన్ని వాడబోను

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: పేదల ఆత్మగౌరవ మే అసలైన అభివృద్ధి అని, భవనాలు ఎవరైనా కడతారని, అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగులు కాదని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పేదలు ఆ త్మగౌరవంతో తలెత్తు కోవడమే అభివృద్ధి అని సి ఎం రేవంత్ వ్యాఖ్యానించారు. 4లక్షల ఇందిరమ్మ ఇళ్లతో పేదలు ఆత్మగౌరవంతో బ్రతుకబోతున్నార ని అన్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యంతో పేద ల ఆత్మగౌరవం పెంచామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కళ్యాణ్‌నగర్‌లోని టిజి జెన్‌కో ఆడిటోరియంలో ప్రముఖ కవి అందెశ్రీ ప్రచురించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని సిఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ తెలంగాణ సమాజం కవులకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఉద్యమకారులు ఎవ రూ తాను ఉద్యమకారుడినని చెప్పుకోరని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

కొందరు నకిలీ ఉద్యమకారు లు తామే ఉద్యమకారులమంటూ చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. వారు అలా చెప్పుకొని తిరగడానికి కారణం నిజమైన ఉద్యమకారులు ఎవ్వరూ కూడా తాము ఉద్యమకారులమని చెప్పుకోకపోవ డమేనని అభిప్రాయపడ్డారు. అందెశ్రీ లాంటి వారు ఎప్పుడూ తాము ఉద్యమకారులమని చెప్పుకోలేదన్నారు. ఉద్యమకారులమని చెప్పుకున్న వాళ్లకు టివిలు, పేపర్లు, వేలకోట్ల ఆస్తులు వచ్చాయని సిఎం ఆరోపించారు. గూడ అంజయ్య, అందెశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న లాంటి కవులు తెలంగాణ ప్రజల్లో స్పూర్తి నింపారన్నారు. అందెశ్రీ, గద్దర్‌లు తెలంగాణ ప్రజల స్వేచ్ఛను ఆకాంక్షించారని ఆయన అన్నారు.

తనకు నచ్చని వారిపై అధికారాన్ని ఉపయోగించను
తాను ఎవరిని శత్రువు గా చూడనని, తాను శత్రువుగా చూడాలంటే వారికి ఆ స్థాయి ఉండాలని సిఎం అన్నారు. తనకు నచ్చని వారిపైన అధికారాన్ని ఉపయోగించే మూర్ఖుణ్ణి కాదని ఆయన అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం తన పదవిని వాడనని, పేదల కోసమే పని చేస్తానని, తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. 2006లో తాను రాజకీయాల్లోకి వచ్చానని తాను 17 ఏళ్ల లో ముఖ్యమంత్రి అయ్యానని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని వారి అభ్యున్నతి కోసం ఉపయోగిస్తానని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజలు తనపై పెద్ద బాధ్యతను పెట్టారని నా గెలుపే నా ప్రత్యర్థులకు దుఃఖం అని, తాను సిఎంగా సంతకం పెట్టడమే వాళ్ల గుండెలపై గీత పెట్టినట్లు అయ్యిందని ఆయన అన్నారు.

సుందరీమణులతో జయ జయహే తెలంగాణ పాట పాడించా
109 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులతో జయ జయహే తెలంగాణ పాట పాడించానని, ఇంత కంటే ఇంకా ఏం కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ తల్లి ముందు వారిని మోకారిల్లేలా చేశానని సిఎం రేవంత్ తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మార్చడమే నా లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రపంచంలో గొప్ప రాష్ట్రంగా తెలంగాణను మారుస్తానని ఆయన పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News