Sunday, July 20, 2025

వెనుకబాటుపై కులాలవారీగా గ్రేడింగ్

- Advertisement -
- Advertisement -

ఆర్థిక, విద్యారంగాలలో స్థితిగతులపై కులాలవారీగా నివేదిక
ప్రభుత్వానికి 300 పేజీల నివేదిక సమర్పించిన కులగణన
నిపుణుల కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్‌రెడ్డి ఇది కేవలం
డేటా కాదు..తెలంగాణ మెగా హెల్త్ చెకప్ రాహుల్‌గాంధీ
ఇచ్చిన మాట ప్రకారం సర్వే విజయవంతంగా నిర్వహించాం
బలహీనవర్గాల అభ్యున్నతికి ఇది ఎంతో కీలకం నివేదికపై
కేబినెట్‌లో చర్చించిన అనంతరం తదుపరి చర్యలు: సిఎం రేవంత్

మన తెలంగాణ/హైదరాబాద్ : కులగణన సర్వే కేవలం కేవ లం డేటా కాదని, తెలంగాణ మెగా హెల్త్ చెకప్ అని ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకా రం రాష్ట్రంలో కులగణన సర్వే విజయవంతంగా నిర్వహించామని, రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యా యాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందని వెల్లడించారు. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అం శాలను, సూచనలను కేబినెట్‌లో చర్చించి ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కులాలవారీగా వెనుక బా టు తనంపై గ్రేడింగ్ ఇస్తూ నిపుణుల కమిటీ నివేదిక రూ పొందించింది. ఆర్థిక, విద్యారంగాలలో ప్రభుత్వానికి 300 పేజీల తమ నివేదికను సమర్పించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఇండిపెండెంట్ ఎక్స్‌పర్ట్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలోని నిపుణులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అర్బన్, రూరల్ ఏరియాల మధ్య వ్యత్యాసాలు, ఇందుకు కారణాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలని, ప్రజల అవసరాలను గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని కమిటీని కోరారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సిఎం ముఖ్య కార్యదర్శి వి. శేషాద్రి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సాంఘీక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఈ.శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ. శరత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ కంచె అయిలయ్య, సభ్యులు ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రొఫెసర్ హిమాన్షు, డా. సుఖదేవ్ తొరాట్, నిఖిల్ డే, ప్రొఫెసర్ భాంగ్య భూక్య, ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్ జీన్ డ్రెజ్, ప్రొఫెసర్ థామస్ పికెట్టి, ప్రవీణ్ చక్రవర్తి, సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి ఈ సందర్భంగా తమ నివేదికను అందించారు. ఈ సర్వే సైంటిఫిక్, అథెంటిక్, రిలయబుల్ అని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. కులగణనలో పేర్కొన్న 242 కులాల వెనుకబాటు తనానికి సంబంధించి కంపోజిట్ బ్యాక్‌వర్డ్ నెస్ ఇండెక్స్ (సిబిఐ) సూచీని నివేదికలో పొందుపరిచింది. 300 పేజీలకు పైగా రూపొందించిన నివేదికలో 242 కులాల వారీగా వెనుకబాటుపై సిబిఐ స్కోర్, ర్యాంకులను ఇచ్చింది.
ఇది దేశానికి రోల్ మోడల్ : తెలంగాణ నిర్వహించిన సర్వే చారిత్రాత్మకమని, ఇది దేశానికి రోల్ మోడల్ గా మారుతుందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, కుల సర్వేను నిర్వహించింది. మొదటి దశలో 2024 నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25వ తేదీ వరకు 50 రోజుల పాటు రాష్ట్రమంతటా సర్వే నిర్వహించింది.

రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభాకు చెందిన సమాచారం సేకరించేందుకు ప్రతి జిల్లాలో ప్రతి 150 కుటుంబాలను ఒక బ్లాక్ గా ఎంచుకుంది. ఒక్కో బ్లాక్ కు ఒక ఎన్యుమరేటర్‌ను, ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,03,889 మంది ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లతో శాస్త్రీయంగా సర్వే చేయించింది. మొదటి విడతలో రాష్ట్రంలో రాష్ట్రంలో 96.9 శాతం కుటుంబాలను సర్వే చేసి ఆయా కుటుంబాల వివరాలను 36 రోజుల్లో డేటా ఎంట్రీ చేయించింది. మొదటి దశలో హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు కొన్ని వేర్వేరు కారణాలతో సర్వేలో తమ వివరాలు నమోదు చేయకపోవటంతో ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండో విడతలో వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. మీ సేవా కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ, ఎంపీడీవో ఆఫీసులు, వ్బ్సైట్ ద్వారా తమ వివరాలకు నమోదు చేయించింది.ఈ సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో 1,15,71,457 గృహాలు ఉన్నాయి. 1,12,36,849 (97.10 శాతం ) కుటుంబాల నుంచి 3,55,50,759 మంది ఈ సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు.

ఈ సమగ్ర కుల గణన సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలు 61,91,294 మంది (17.42 శాతం), ఎస్టీలు 37,08,408 మంది (10.43 శాతం), బీసీలు 2,00,37,668 మంది (56.36 శాతం), ఇతర కులాలకు చెందిన వారు 56,13,389 మంది (15.89 శాతం) మంది ఉన్నారు. ఈ సర్వే వివరాల నివేదికను ప్రభుత్వం అసెంబ్లీకి సమర్పించింది. సర్వే ఫలితాలను అధ్యయనం చేసి విధాన నిర్ణయాలను రూపొందించేందుకు వీలుగా సర్వే డేటాను విశ్లేషించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి సుదర్శన్ రెడ్డి అధ్వర్యంలో 11 మంది సభ్యులతో స్వతంత్య్ర నిపుణుల వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. సర్వే ఫలితాలను విశ్లేషించి వివరణాత్మక నివేదికను అప్పగించే బాధ్యతను ఈ నిపుణుల కమిటీకి అప్పగించింది. వివిధ దఫాలుగా సమావేశాలు జరిపిన కమిటీ డేటాను సేకరించిన పద్దతి నిశితంగా ఉందని గుర్తించింది. ప్రభుత్వ విధానాల రూపకల్పనతో పాటు ఇప్పుడు అమల్లో ఉన్న విధానాలను మెరుగుపరిచేందుకు, సామాజిక న్యాయం, సామాజిక సాధికారత మరియు వెనుకబడిన బలహీనవర్గాల వర్గాల అభ్యున్నతిని మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని సూచించింది.

కుల గణన దేశ దిశను మారుస్తుంది : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
సర్వే విశ్లేషణ ఆధారంగా సంపద, వనరులు ఇంకా అందని వర్గాలకు చేరవేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి సైంటిఫిక్ సర్వే జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే, సర్వే ఆధారంగా విశ్లేషణ ఈ దేశ దిశను మారుస్తుందని భట్టి విక్రమార్క అన్నారు. శనివారం సాయంత్రం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో సర్వే నివేదిక సమర్పణ సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే సమాచారం ఆధారంగా స్వతంత్ర మేధావుల కమిటీ చేసిన అధ్యయనం చారిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రముఖులు, ఎలాంటి ముద్రలు లేని వివాదరహితులను కమిటీ సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సర్వే దేశంలో ఇప్పటివరకు ఎక్కడ జరగలేదని ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం గర్వంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు.

భారత్ జూడో పాదయాత్ర లో భాగంగా మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుల సర్వే చేపట్టిందని తెలిపారు. ఈ సర్వే చేపట్టాలని ఆ బాధ్యతలను మొదట ప్రణాళిక శాఖకు ఇవ్వడంతో కొత్త ఆందోళన చెందాము కుల సర్వే దేశంలో ఎక్కడా జరగలేదు. బీహార్ లో జరిగిన న్యాయస్థానాల్లో బ్రేకులు పడ్డాయి అని వివరించారు. కుల సర్వే పై క్యాబినెట్ మొత్తం సీరియస్ గా చర్చించి, ప్రశ్నాపత్రాలు రూపొందించి, లెక్కింపు, బ్లాక్ ల ఏర్పాటు అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ముగించుకొని సర్వే నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల సర్వేను అసెంబ్లీలో ప్రవేశపెడితే సభ్యులు అనేక రకాల ప్రశ్నలు అడిగారు తప్ప లోపం ఉందని ఎవరూ చెప్పలేదని డిప్యూటీ సీఎం వివరించారు. కుల గణన సమాచారం వచ్చిన తర్వాత ఏం చేద్దాం, భవిష్యత్తు ప్రణాళిక ఏంటి అని సీఎం రేవంత్ రెడ్డి, క్యాబినెట్ సభ్యులు చర్చించి దేశంలోనే ఉన్నత స్థానంలో ఉన్న జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కంచ ఐలయ్య, ప్రవీణ్ చక్రవర్తి, తోరట్ వంటి మహామవులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు వివరించారు.

సమాజం పట్ల అనురాగం, నిబద్ధత, ప్రేమ ఉన్న వ్యక్తులు కమిటీలో సభ్యులుగా ఉన్నారని డిప్యూటీ సీఎం తెలిపారు. కమిటీ చైర్మన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కుల గణన కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతమంది రెడ్లు ఉన్నప్పటికీ ఎలాంటి భేదాలు లేకుండా అణగారిన వర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని బాధ్యతతో పని చేయడంతో సర్వే నిర్వహణ, విశ్లేషణ కార్యక్రమంలో విజయవంతం అయ్యామని డిప్యూటీ సీఎం తెలిపారు. కమిటీ సభ్యులు పడిన కష్టం చెప్పడానికి తనకు మాటలు రావడంలేదని, సామాజిక న్యాయం, సమానత్వం, సంపద పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. విలువైన సమయాన్ని కేటాయించి నివేదికను విశ్లేషించిన మేధావులకు ధన్యవాదాలు వారి సూచనలను ప్రభుత్వం కచ్చితంగా వినియోగించుకుంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News