Thursday, September 4, 2025

చెత్తగాళ్ల వెనుక… నేనెందుకు ఉంటా

- Advertisement -
- Advertisement -

బుద్ధి ఉన్నోడెవరైనా వారి
వెనకాల ఉంటారా? నేను
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల
వెంటే ఉంటా మీ కుల,
కుటుంబాల వివాదంలోకి
మమ్మల్ని లాగొద్దు వాళ్లకు
వాళ్లే కడుపులో కత్తులు పెట్టుకొని
కౌగిలించుకుంటున్నారు
అవినీతి సంపద పంపకంలో వచ్చిన
తేడాలతోనే కొట్లాడుకుంటున్నారు
బిఆర్‌ఎస్‌లో ‘పంచాయితీ’లపై
సిఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు
భవిష్యత్‌లో కారు పార్టీ కనుమరుగు
ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కే మొదటి
ప్రాధాన్యత పెండింగ్ ప్రాజెక్టులను
సకాలంలో పూర్తి చేస్తాం
పాలమూరులో సిఎం రేవంత్

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో : బిఆర్‌ఎస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామా లు, కవిత సస్పెన్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటిసారిగా స్పందించారు. చెత్తగాళ్ల వెనుక నే నెందుకుంటానని బిఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, సంతోష్, కవితను ఉద్దేశించి సిఎం ఘాటుగా స్పం దించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా, ముసాబ్‌పేట మండలం, వేముల గ్రామంలో ఎస్‌జిడి ఫార్మాకోజెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రెండవ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. ‘బిఆర్‌ఎస్ నేతలు ఒకప్పుడు ఏ రాజకీయ పార్టీని బతకనీయమన్నా రు. ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎంతోమందిని జైళ్లకు పంపించిన్రు…వాళ్లే ఇవాళ తన్నుకొని ఛస్తున్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరూ అక్కర లేకుండగానే వాళ్ల కు వాళ్లే పొడుచుకుంటున్నారు’ అని ఎద్దేవా చేశా రు. అవినీతి సొమ్ము వచ్చిన తర్వాత ఆ సొమ్ము ల పంపకాల్లో తేడాలొచ్చి వారికి వారే కొట్లాడుకుంటున్నారని, వారికి
వారే యాసిడ్ దాడులు చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఒకరు నవ్వుతూనే కడుపులో కత్తులు పెట్టుకొని నటించే పరిస్థితులు ఆ పార్టీలో దాపురించాయని, పాపం ఊరికే పోదని పెద్దలు చెప్పిండ్రని, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహానుభావా అని.. ఆ పాపాలు ఎక్కడికీ పోవని, కచ్చితంగా వెంటాడుతూనే ఉంటాయ,ని వారు అనుభవించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఆయన వెనుకాల ఈయన ఉన్నాడని, ఈయన వెనుకాల ఆయన ఉన్నాడని తనను అంటున్నారని, ‘అసలు చెత్తగాళ్ల వెనుక నెనెందుకుంటాను, నేను నాయకుడిని.. ఉంటే ప్రజల వెంట ఉంటా, మా వారికి ముందు ఉంటూ తోడుగుంటాను. వారికి వారే కత్తులతో పొడుచుకొని హరీశ్‌రావు, సంతోష్ వెనుక రేవంత్ ఉన్నాడని ఒకరంటే లేదు ..లేదు.. కవిత వెనుక రేవంత్ ఉన్నాడని మరొకడు అంటున్నారు. వారందరూ దిక్కుమాలినోళ్లని తెలంగాణ ప్రజలు ఉతికి బండకేసి కొట్టారు. మీ వెనకాల ఎవరైనా బుద్ధ్ది ఉన్నోడు ఉంటాడా? అన్నం తినేవాడు ఉంటాడా? నేను ఉండేది నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల వెంట ఉంటాను. ఇంత పనికిమాలిన వాళ్ల వెంట ఎందుకుంటానని స్పష్టం చేశారు.

‘రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తెలుసు.. దయచేసి మీ కుటుంబ పంచాయితీల్లోకో, మీ కులం పంచాయితిల్లోకి నన్ను లాగకండి’ అని అన్నారు. ‘జనం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించారని, మీరు కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు’ అని వ్యాఖ్యానించారు. బిఆర్‌ఎస్ కాలగర్బంలోకి కలిసిపోతుందని జోస్యం చెప్పారు. ఒకప్పుడు మంచి పేరున్న జనతా పార్టీ కనుమరుగైందని అన్నారు. తెలుగుదేశం పార్టీ చాలా మంచి పార్టీ.. అనేక మందికి అవకాశాలు కల్పించిన పార్టీ ఆ పార్టీని కూడా కొంతమంది కుట్రల వలన తెలంగాణలో ఆ పార్టీ సమస్యను ఎదుర్కొంటున్నదని అన్నారు. ఎన్నో పాపాలు చేసిన బిఆర్‌ఎస్ ఎలా మనుగడ సాగిస్తుందని అన్నారు. ప్రకృతి అనేది ఉంటుందని అ ప్రకృతే శిక్షిస్తుందని వ్యాఖ్యానించారు.

మొదటి ముద్ద పాలమూరుకే
‘పాలమూరు జిల్లా నుంచి మొదటిసారిగా బూర్గుల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి అయితే 75 ఏళ్ల తర్వాత మళ్లీ పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డికి అవకాశం వచ్చింది. ఇప్పుడు పాలమూరును అభివృద్ధి చేసుకోక పోతే ఇక ఎప్పటికీ అభివృది చెందదు. ఏ పరిశ్రమ వచ్చినా మొదట పాలమూరుకే పంపిస్తాను. కుర్చీలో కూర్చున్నది మీ వాడు.. మీ పాలమూరు వాడు.. ఎప్పుడూ మొదటిముద్ద మొదట పాలమూరుకే పెడతా.. అది నైతిక ధర్మం బాధ్యత’ అని అన్నారు. ‘అది చిన్నదా, పెద్దదా కా దు, ఏదైనా పాలమూరుకు మంజూరు చేస్తాను. ఎవరు ఏమనుకున్నా ముందు పాలమూరుకు ప్రా ధాన్యత ఇస్తా’ అని స్పష్టం చేశారు. పాలమూరు జిల్లా అభివృద్ధి చూసి ఇతర ప్రాంతాలు అసూయపడాలి. పెద్ద పెద్ద పరిశ్రమలు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్, బెంగుళూరును డిఫెన్స్ కనెక్టింగ్ క్యారిడార్‌గా మారుస్తా..డ్రైపోర్ట్‌ను తెచ్చుకుందాం, బ్రహ్మోస్ మిస్సైల్ క్షీపణి పరిశ్రమను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనులను అడ్డుకుంటే మనకు మనమే మరణశాసనం రాసుకున్నట్లని అన్నారు.

ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కే మొదటి ప్రాధాన్యత
రాష్ట్రంలో విద్య, సాగునీటి ప్రాజెక్టులకే తన మొదటి ప్రాధాన్యత ఉంటుందని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పండింట్ నెహ్రూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రాజెక్టులు, యూనివర్సిటీల నిర్మాణం జరిగిందని, తాను కూడా అదే ఆయన స్ఫూర్తితో విద్య, సాగునీటికి ప్రాధాన్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్య ద్వారా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరిగితే సాగునీటి ప్రాజె క్టుల ద్వారా రైతుల అభివృద్ధితో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గత పాలకులు పాలమూరు జిల్లాను కేవలం కరువు, వలసలు చూపించేందుకు ఇతర ప్రపంచ దేశాల అధినేతలను తీసుకొచ్చేవారు తప్పితే జిల్లాను ఎలాంటి అభివృద్ధ్ది చేయలేదన్నారు. గతంలో ఒక ఎంపిని పార్లమెంట్‌కు ఎంపిగా పంపితే తెలంగాణ సాధించిన తర్వాత పాలమూరులో ప్రాజెక్టులను పడావు పెట్టారని మాజీ సిఎం కెసిఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

పాలమూరు బిడ్డగా తాను సిఎం అయిన తర్వాత పాలమూరు ప్రాజక్టులకు నిధులు కేటాయింపులు చేసి పాలమూరు రంగారెడ్డితో పాటు కల్వకుర్తి, కోయిలసాగర్, భీమా, నెట్టెం పాడు పెండింగ్ పనులు పూర్తి చేస్తామన్నారు. నారాయణపేట=కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొస్తే కొందరు పర్యావరణ కోర్టులో కేసులు వేయించి పనులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రాజెక్టుల కోసమో, పరిశ్రమల కోసమో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారాన్ని సాధ్యమైనంత వరకు పెంచి ఇవ్వాలని స్పష్టం చేశారు. రైతుల దగ్గరికే కలెక్టర్లు వెళ్లి భూమి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. పరిశ్రమలు వస్తే జిల్లా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు యూనివర్సిటీకి మంచి గుర్తింపుతో పాటు లా, ఇంజనీరింగ్, త్రిబుల్ ఐటి తీసుకొచ్చామని స్పష్టం చేశారు. రూ.220 కోట్లతో ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలను నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో ఐఐటిలకు అనుసందానంగా ఎసిటి ట్రైనింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటి ద్వారా శిక్షణ పొందిన వారికి దేశంతో పాటు విదేశాల్లో కూడా మంచి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిట శ్రీహరి, ఎంపి మల్లు రవి, ఎంఎల్‌ఎలు జి. మధుసూదన్ రెడ్డి, యన్నం శ్రీనివాస్ రెడ్డి, ఫర్నిక రెడ్డి, అనురుధ్‌రెడ్డి, కలెక్టర్ విజయేంద్రి బోయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News