Sunday, September 14, 2025

గొప్ప రాజనీతిజ్ఞడు బూర్గుల రామకృష్ణారావు:సిఎం రేవంత్ రెడ్డి,

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ స్టేట్ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 58వ వర్ధంతి సందర్భంగా ఆదివారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. జిహెచ్‌ఎంసి వద్ద గల బూర్గుల రామకృష్ణారావు విగ్రహం వద్ద పలువురు ప్రముఖులు నివాళ్లు అర్పించారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) రాష్ట్రఅధ్యక్షుడు, శానసమండలి సభ్యుడు బి.మహేష్‌కుమార్ గౌడ్, బిసి సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బిసి కమిషన్ చైర్మన్ నిరంజన్, ఉర్దూ అకాడమి చైర్మన్ తాహెర్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచంద్రరావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి బూసాని వెంకటేశ్వర్లు తదితరులు పలువురు ఘనంగా నివాళ్లు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పిసిసి) రాష్ట్రఅధ్యక్షుడు, శానసమండలి సభ్యుడు బి.మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ వాణిని ఎలుగెత్తి చాటిన బూర్గుల రామకృష్ణారావు తెలంగాణ ఏర్పడడానికి నాంది పలికారని అన్నారు. తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావు చెరగని ముద్ర వేశారని, వారి దూరదృష్టి ఇప్పటికీ మనందరికి ఆదర్శమని అన్నారు. భవిష్యత్ తరాలకు బూర్గుల స్ఫూర్తిదాయక నేతగా నిలిచారని కొనియాడారు. వారు చూపిన మార్గంలోనే కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ప్రజాసేవకు కట్టుబడి ఉందని తెలిపారు. యువతరానికి బూర్గుల రామకృష్ణారావు గారు మార్గదర్శి అని గౌరవంతో ఆయన గుర్తుచేశారు.

గాంధీభవన్‌లో
హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల బూర్గుల రామకృష్ణారావుకు ఆదివారం గాంధీ భవన్‌లో బూర్గుల చిత్ర పటానికి పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తోపాలు పలువురు కాంగ్రెస్ నేతలు పూల దండ వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుడు బి.మహేష్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ గొప్ప సామాజిక సంస్కర్త, రాజనీతిజ్ఞడు, బహు భాషావేత్త, హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణా రావు అని కొనియాడారు. బూర్గుల గొప్ప సామాజిక సంస్కర్త అని చెబుతూ చేపట్టిన కార్యక్రమాల గురించి వివరించారు. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నివాళులు అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుడు, బహుభాషావేత్త, రాజనీతిజ్ఞుడు, భూదానోద్యమానికి చట్టబద్ధత కల్పించి భూ సంస్కరణలకు నాంది పలికిన మహానేత బూర్గుల రామకృష్ణారావు అని కొనియాడారు.

బిజెపి నేతల నివాళ్లు
తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అని భావిస్తున్నానని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు తెలిపారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి బూర్గుల రామకృష్ణారావు విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.

Also Read: రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News