- Advertisement -
హైదరాబాద్ లో కట్టుదిట్టమైన భద్రతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్, మాక్ డ్రిల్ తర్వాత పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష నిర్వహించారు. ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
అలాగే, విమానాశ్రయంతోపాటు హైదరాబాద్ పరిధిలోని ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను పెంచాలని అధికారులను సిఎం, డిప్యూటీ సిఎంల ఆదేశించారు. హైదరాబాద్‌లో విదేశీ రాయబార కార్యాలయాల వద్ద కూడా బలగాల మోహరించాలని, కమాండ్ కంట్రోల్ సెంట్రల్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
- Advertisement -