Saturday, May 24, 2025

అసెంబ్లీకి రండి.. అద్భుతాలు చేద్దాం

- Advertisement -
- Advertisement -

40ఏళ్ల అనుభవంతో సలహాలు, సూచనలు ఇవ్వండి ముఖ్యమంత్రి
అయ్యాక నేను అహంభావం ప్రదర్శించలేదు విపక్షనేత శాసనసభకు
రాకపోతే ప్రజలే నిర్ణయం తీసుకుంటారు అవసరమైతే ప్రధాని మోడీని
ఇంకా 50సార్లయినా కలుస్తా ప్రాజెక్టులు, నిధులు తెస్తా 5,612 మంది
నిమ్జ్ భూనిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు అదానీ, అంబానీలతో
పోటీపడేలా మహిళలను ప్రోత్సహిస్తాం టోక్యో, న్యూయార్క్‌లకు దీటుగా
ఫ్యూచర్ సిటీ బసవేశ్వరుడి స్ఫూర్తితోనే రాష్ట్రంలో కులగణన
జహీరాబాద్‌లో చక్కెర పరిశ్రమ కోసం 100 ఎకరాలు కేటాయిస్తాం
పస్తాపూర్ బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

మన తెలంగాణ/హైదరాబాద్/సంగారెడ్డి బ్యూరో : అవసరమైతే ప్రధాని మోడీని ఇంకో 50 సార్లు క లుస్తామని, రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు మం జూరు చేయించుకుంటామని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సాయం తీ సుకుంటామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే అభివృద్ధిని సాధించగలమని సిఎం తె లిపారు. అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చే స్తామని, ఎవరేం అనుకున్నా తనకు ఇబ్బంది లే దని ఆయన తెలిపారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని తర్వాత అందరిని కలుపుకుపోయి రాష్ట్ర అ భివృద్ధికి ప్రజాసంక్షేమానికి పాటుపడతామని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ లో శుక్రవారం అనేక అభివృద్ధి పను-లను సిఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం పస్తాపూర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ నిమ్జ్ భూసేకరణలో రైతులకు పరిహారం విష-యంలో అన్యాయం జరిగిందని, 5,612 కుటుంబాల్లోని భూ నిర్వాసితుల్లో ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ని మ్జ్ భూ బాధితులకు పరిహారాన్ని పెంచామన్నా రు. త్వరలోనే నిమ్జ్‌లోని 450 ఎకరాల్లో హ్యూం దాయ్ కంపెనీ కార్లను తయారీ చేయబోతుందని సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. నిమ్జ్‌లో భూ బాధితులకు భోజనాలు పెట్టి, ఇందిరమ్మ ఇళ్ల్లు ఇచ్చే బాధ్యతను తమ పార్టీ నేత జగ్గారెడ్డికి అప్పజెపుతున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలని, తన 40 ఏళ్ల అనుభవంతో ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వా-లన్నారు. అప్పుడు అద్భుతాలు సృష్టించవచ్చన్నారు.ఫాంహౌస్‌లో పడుకోవద్దని ఆయన పేర్కొన్నారు. అధికా-రంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తానని ఆయన అనుకుంటే, ప్రజలే తగిన నిర్ణయం తీసు-కుంటారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చెరువుపై అలిగి ఒకాయన ఫాంహౌస్‌లో పడుకున్నారని, తాము ఆ విధంగా చేయ-లేమని సిఎం ఎద్దేవా చేశారు. తాను జడ్‌పిటిసిగా, ఎంఎల్‌సిగా, ఎంఎల్‌ఎగా, ఎంపిగా, ప్రతిపక్షంలో ఉన్నా పనిచేశానని, ఎప్పుడూ సెలవు తీసుకోలేదని ఆయన తెలిపారు. సిఎం అయ్యాక కూడా తాను అహంభావం ప్రదర్శించలేదని, చిన్నా, పెద్దా లేకుండా అందరినీ కలుస్తున్నానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి, ప్రజలకు పంచాలి అనేది తన సిద్ధాంతమని ఆయన చెప్పారు. వరి వేసుకుంటే, ఉరివేసుకోవాలని ఆనాడు ఒక నాయకుడు అన్నారని తాము మాత్రం సన్నాలకు రూ.500ల బోనస్‌గా ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. ఐదేళ్లలో కోటి మందిమహిళలను కోటీశ్వరులుగా మారుస్తామన్నారు. అదానీ, అంబానీలతో పోటీ వ్యాపారం చేసేలా ప్రోత్సహిస్తామన్నారు.

ఇందిరమ్మ చొర-వతో మెదక్ జిల్లాలో బిహెచ్‌ఇఎల్, బిడిఎల్ కంపెనీలు
ఇందిరమ్మ చొర-వతో నాడు మెదక్ జిల్లాలో బిహెచ్‌ఇఎల్, బిడిఎల్ కంపెనీలు వచ్చాయని, పటాన్‌చెరు ప్రాంతం మినీ ఇండియాగా అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఇందిరమ్మ అంటే మెదక్ జిల్లా అని, మెదక్ జిల్లా అంటే ఇందిరమ్మ అని, మెదక్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ దేశం కోసం ఇందిరమ్మ ప్రాణ త్యాగం చేశారని సిఎం రేవంత్ కొనియాడారు. మంత్రి రాజనర్సింహ, ఎంపి షెట్కార్, ఎంఎల్‌ఎ మాణిక్‌రావు, పార్టీ అగ్ర నేత జగ్గారెడ్డి సూచనల మేరకు 5,612 నిమ్జ్ భూ బాధిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని సిఎం రేవంత్ తెలిపారు. బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లోనూ అభివృద్ధి కొనసాగుతుందని ఆయన అన్నారు. జహీరా-బాద్ అభివృద్ధిపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.

స్వయం సహాయక సంఘాలకు రూ.21వేల కోట్ల బ్యాంకు లింకేజీ
స్వయం సహాయక సంఘాలకు ఈ సంవత్సరం రూ.21 వేల కోట్ల బ్యాంకు లింకేజీని ఇస్తున్నామని సిఎం చెప్పారు. ఆడబిడ్డలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూస్తామని, ఐదేళ్లలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మాట ఇస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. చెరుకు రైతులు సహకార సంఘంగా ఏర్పడి ముందుకు వస్తే, నిమ్జ్‌లో వంద ఎకరాలను కేటాయించి, చెరుకు కర్మాగా-రాన్ని ర్పాటు చేస్తామని సిఎం రేవంత్ హామీ ఇచ్చారు.

బసవేశ్వరుడు బాటలో కాంగ్రెస్ పాలన
విశ్వగురువు బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ, ఆయన చూపిన బాటలోనే తెలంగాణ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ 150 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారని, ఆ యాత్రలో భాగంగా బసవేశ్వరుడి సూచనల మేరకే కాంగ్రెస్ జనగణనతో కులగణన చేయాలని రాహుల్ ప్రకటించిన విషయాన్ని సిఎం గుర్తు చేశారు. సామాజిక వర్గాలకు భాగస్వామ్యం కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వ కులగణన చేపట్టిందన్నారు. బసవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచికగా భావిస్తున్నామన్నారు. వారి సందేశాన్ని తీసుకుని సామాజిక న్యాయం అందిస్తున్నామని భవిష్యత్‌లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి అన్నారు.

వార్డు మెంబర్ మొదలుకుని ఇతర స్థానాలను గెలిపించుకుంటాం
ఎవరూ ఏమనుకున్నా సోనియాగాంధీ నాయకత్వంలో రానున్న స్థానిక ఎన్నికల్లో వార్డు మెంబర్ మొదలుకుని ఇతర స్థానాలను గెలిపించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పరిశ్రమలు తీసుకువచ్చి, ఆదాయాన్ని పెంచి పేదలకు పంచుతామని, వన్ ట్రిలియన్ ఎకనామీ రాష్ట్రంగా , తెలంగాణ ను నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని సిఎం అన్నారు. టోక్యో, న్యూయార్క్ సిటీలకు సరసన భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ కానుందని అంతవరకు నిద్రపోనని ఆయన తెలిపారు. సింగూరు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి సహకరిస్తామని సిఎం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండా సురేఖ, ఎంపి సురేష్ షెట్కార్, ఎంఎల్‌ఎసి అంజిరెడ్డి, ఎంఎల్‌ఎలు మాణిక్‌రావు, సంజీవరెడ్డి, లక్ష్మీకాంతరావు, మదన్‌మోహన్‌రావు, టిజిఐఐసి చౌర్మన్ నిర్మలా, జగ్గారెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News