Wednesday, July 9, 2025

కరాచీ బేకరీ అగ్నిప్రమాదంపై సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లోని కరాచీ బేకరీ గోడౌన్‌లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన 15 మంది కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులేనని అధికారులు సీఎంకు తెలిపారు. గాయపడిన వారిలో ఎనిమిది మందిని కంచన్ బాగ్ డిఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శిని రేవంత్ ఆదేశించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News