మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతిపక్షపాత్ర పోషించకుండా తమను ప్రశ్నించే అర్హత కెసిఆర్‌కు లేదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 16 నెలల నుంచి అసెంబ్లీకి రాకుండా 60 లక్షల జీతం తీసుకొని ఫాంహౌజ్‌లోనే కెసిఆర్ ఉంటున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభు త్వ బంగ్లా, కారు తీసుకొని ఎందుకు కెసిఆర్ ప్రతిపక్ష పాత్ర పోషించ డం లేదని రేవంత్ ప్రశ్నించారు. ప్రతిపక్ష పాత్ర పోషించకుండా కెసిఆర్ ఫాంహౌజ్ లోనే ఎందుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రజలు కష్టా ల్లో ఉన్నట్లయితే కెసిఆర్ ఎందుకు వాళ్ల దగ్గరకు వెళ్లడం లేదని ఆయన ప్రశ్నించారు.బుధవారం రవీంద్రభారతిలో శ్రీమహాత్మా బసవేశ్వర 892 వ జయంతో త్సవ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నా రు. ఈ సందర్భంగా సిఎం రేవంత్ మాట్లా డుతూ కెసిఆర్ తన ప్రసంగంలో తన పేరును ఎక్కడా ప్రస్తావించే ధైర్యం చేయలేదన్నారు. తమ ప్రభు త్వం తెచ్చిన ఏ పథకం ఆగిపోయిందో కెసిఆర్ చెప్పాలని రేవంత్ డి మాండ్ చేశారు. పెన్షన్లు ఆగిపోయాయా? రైతుబంధుఆగిపోయిందా? ఫీజు రీయింబర్స్‌మెం ట్స్ నిలిచిపోయిందా? ఈ విషయాలపై కెసిఆర్ చ ర్చకు రావాలని ఆయన సూచించారు. కెసిఆర్ కళ్ల ల్లో మాటల్లో విషం కనిపించిందని ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇ స్తే పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు విలన్ అంటున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్ పదేళ్లు ఫాంహౌజ్ లోనే ఉంటారు
అధికారం, ఆదాయం ఉంటేనే పనిచేస్తారా అం టూ సిఎం రేవంత్‌రెడ్డి కెసిఆర్‌పై ఫైర్ అయ్యారు. తెలంగాణలో పదేళ్లు మేమే అధికారంలో ఉంటామని, కెసిఆర్ పదేళ్లు ఫాంహౌజ్‌లోనే ఉంటారని ఆయన ఎద్దేవా చేశారు. ఆ తర్వాత కెసిఆర్ చరిత్ర అక్కడే పరిసమాప్తం అవుతుందని సిఎం రేవంత్ పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ సభకు ఎన్ని బస్సులు అడిగినా ఇవ్వాలని అధికారులను ఆదేశించానని, బిఆర్‌ఎస్ సభకు పూర్తిగా సహకరించామని సిఎం రేవంత్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలని ఆయన సూచించారు. కెసిఆర్ సభలో ఒక్క ప్రజాసమస్యను అయినా ప్రస్తావించారా అని చెప్పాలని సిఎం డిమాండ్ చేశారు. తాము తీసుకొచ్చిన పథకాలపై చర్చకు సిద్ధమా అని కెసిఆర్‌కు ఆయన సవాల్ విసిరారు. కెసిఆర్ ఫ్యామిలీ తెలంగాణ మీద పడి దోచుకుంది నిజం కాదా? ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పా ర్టీ ఏ విధంగా విలన్ అయ్యింది, తెలంగాణ ఇచ్చినందుకు విలన్ అయ్యిందో చెప్పాలన్నారు. మంది పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా మీ ఇంట్లో వాళ్లకు కెసిఆర్ పదవులు ఇవ్వలేదా? అని సిఎం రేవంత్ ప్రశ్నించారు.
నేటి తరానికి బసవేశ్వరుడు ఒక స్ఫూర్తి
నేటి తరానికి బసవేశ్వరుడు ఒక స్ఫూర్తి అని, ఆ యన ఒక సంఘసంస్కర్త అని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా బసవేశ్వరుడు పోరాడారని ఆయన పేర్కొన్నారు. విప్లవ కారుడు అంటే తుపాకులు పట్టుకోవాల్సిన అవసరం లేదని సిఎం పేర్కొన్నారు. విప్లవాత్మకమైన మార్పు తెచ్చే ఎవరైనా విప్లవకారుడేనని సిఎం తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం పనిచేస్తున్నామని సిఎం అన్నారు. రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నామని, తమ ప్రజాప్రతినిధులం దరూ బాధ్యతతో పనిచేస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.రాహుల్ గాంధీపై బసవేశ్వరుడి ప్రభా వం ఎక్కువని సిఎం అన్నారు.
ప్రభుత్వ తప్పిదాలు సరిదిద్దేలా ప్రతిపక్ష వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని, అలాగే, ప్రజల అభివృద్ధి జీవన ప్రమాణాలు పెం చేలా రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నట్లు సిఎం తెలిపారు. 12 వ శతాబ్దంలోనే సమాజంలో అనేక మార్పు లకు పునాదులు వేసిన విప్లవకారుడు బసవేశ్వరుడని ఆయన పేర్కొన్నారు. ఆయన జయంతి రోజున పదోతరగతి ఫలితాలు విడుదల చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. బసవన్న స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కుల, మత, లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన అభ్యుదయవాది బస వన్న బసవేశ్వర స్ఫూర్తితోనే పంచాయతీ రాజ్ పార్లమెంటరీ వ్యవస్థను మనం తెచ్చుకున్నామన్నారు. ప్రతి మనిషి గౌరవంగా బ్రతికేలా ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలని సిఎం రేవంత్ సూచించారు.