Wednesday, July 2, 2025

కిషన్‌రెడ్డిపై అనుమానాలు కలుగుతున్నాయి.. సిఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

- Advertisement -
- Advertisement -

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను బతికించే పనిలో కిషన్‌రెడ్డి ఉన్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మంగళవారం సిఎం రేవంత్ మాట్లాడుతూ.. కిషన్‌రెడ్డి మాట్లాడే ప్రతి మాట.. కెటిఆర్ ఆఫీసు నుండి వచ్చే ప్రెస్‌నోటేనని అన్నారు. “తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై మేం కిషన్‌రెడ్డి దగ్గరికి వెళ్తే.. ఆయన ఎప్పుడూ మమ్మల్ని కేంద్ర మంత్రి దగ్గరికి తీసుకుపోలేదు. మేం పోతే.. మాకంటే ముందు రోజే ఆయన మంత్రులను కలుస్తున్నారు. కిషన్‌రెడ్డి తీరు అనుమానాలు కలిగిస్తున్నాయి. రాష్ట్ర నీటి హక్కులను కాపాడటంలో పోరాడుతునే ఉంటాం. రాజకీయంగా, న్యాయపరంగా పోరాడుతాం” అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News