మన తెలంగాణ/హైదరాబాద్: ట్రంప్ ఒ త్తిడికి మోడీ ప్రభు త్వం లొంగిపోయిందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పహల్గాం దాడి త ర్వాత దేశం అంతా ముక్త కం ఠంతో కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిందని, కానీ, పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడం లో కేంద్రం ప్రభుత్వం విఫలమైందని సి ఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుం డా మోడీ ప్రభుత్వం వెనకడుగు వేసిందని, గొప్పల కోసం పార్టీ శ్రేణులను వీ ధుల్లో తిప్పుతున్నారని ఆయన విమర్శించారు. బుధవారం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి సిఎం రేవంత్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ దేశానికి వన్నె తెచ్చిన నేత రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ కొనియాడారు. 18 ఏళ్లకే యువతకు ఓటు హక్కు కల్పించారని దేశంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్‌గాంధీకి సొంతమని ఆయన అన్నారు.
గొప్పల కోసం బిజెపి తమ శ్రేణులను వీధుల్లో తిప్పుతోంది
1971 పాకిస్తాన్ పై ఇందిరాగాంధీ యుద్ధం చేసి బలమైన గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. పాక్‌ను రెండు ముక్కలు చేసి శాశ్వత గుణపాఠం చెప్పారన్నారు. భారత్‌పై తీవ్రవాద ముసుగులో పాక్ దాడి జరిపితే ఇందిరాగాంధీ తెగువ చూపారన్నారు. దాదాపు 54 ఏళ్ల తర్వాత ఉక్కు మహిళ తెగువను ప్రపంచం గుర్తు చేసుకుంటుందని ఆయన అన్నారు. తీవ్రవాదంపై పోరాడటం ప్రతి భారతీయుడి కర్తవ్యమని ఈ సందర్భంగా సిఎం రేవంత్ అన్నారు. గొప్పల కోసం బిజెపి పార్టీ తమ శ్రేణులను వీధుల్లో తిప్పుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌తో పాటు ప్రజలందరూ అండగా ఉన్నప్పటికీ ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయి వచ్చిన అవకాశాన్ని మోడీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదని ఆయన విమర్శించారు.
ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల త్యాగాలను…
పాకిస్తాన్ విషయంలో అమెరికాకు లొంగిపోయి వెనకడుగు వేసిన మోడీ గొప్పల కోసం పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పుతున్నారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విచక్షణ కోల్పోయి రాహుల్‌గాంధీని విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మొట్టమొదట కేంద్రానికి అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వమని క్యాండిల్ ర్యాలీ తీసి కేంద్రానికి, బలగాలకు అండగా నిలిచామని అన్నారు. ఆ రోజు తాము చేసిన పనికి అభినందించడానికి కిషన్‌రెడ్డికి నోరు కూడా రాలేదని ఆయన విమర్శించారు. తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కిషన్‌రెడ్డి రాహుల్‌గాంధీపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం అసువులు బాశారని, రాజీవ్ విగ్రహంపై సంకుచిత ఆలోచనతో విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సచివాలయం వద్ద రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొందరు విమర్శలు చేస్తున్నారని, ఈ రోజు దేశం అంతా ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల త్యాగాలను గుర్తు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. సంకుచిత మనస్తత్వం కలిగిన కొందరు రాజీవ్‌గాంధీని విమర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, దేశ ప్రజల హక్కులను, స్వాతంత్య్రాన్ని కాపాడటానికి అండగా నిలబడతామని ఈ సందర్భంగా సిఎం చెప్పారు. దేశరక్షణ కోసం భారత జవాన్‌లకు అండగా నిలబడుతామని, దేశ సమగ్రత విషయంలో తాము రాజకీయాలు చేయమని, దేశ భద్రతకు తాము కట్టుబడి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.