Sunday, July 20, 2025

తెలంగాణ పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నాం: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి సిఎం మాట్లాడారు. “సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు.. రాష్ట్ర ప్రజల కలలు నిజం చేసిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు. దశాబ్దాల పోరాటంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. పదేళ్ల ఆధిపత్యం తిరస్కరించి ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. మేము బాధ్యతలు స్వీకరించే నాటికి ఆర్థిక పరిస్థితి ఆగమాగమైంది. నిర్వీర్యమైన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసేలా చేశాం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా అజెండా” సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News