Saturday, May 3, 2025

ఈనెల 8న హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించనున్న సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో హైడ్రా పోలీస్ స్టేషన్ రాబోతోంది. ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పిఎస్ ను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లోని చెరువులు, పార్కులు కబ్జా కాకుండా వాటిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కమిసన్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. హైడ్రా వచ్చి రాగానే.. పలు ప్రాంతాల్లో పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలపై విరుచుకుపడింది. పలు చోట్ల అక్రమకట్టడాలను హైడ్రా కుప్పకూల్చింది.

అయితే, హైడ్రాపై తొలుత పాజిటీవ్ వచ్చినా.. కొన్ని అక్రమ కట్టడాలని తెలిసినా.. ఎందుకు కూల్చడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే క్రమంలో కొందరు హైకోర్టును ఆశ్రయించడంతో హైడ్రా స్పీడ్ కు బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు మళ్లీ హైడ్రా స్పీడ్ పెంచనుంది. హైడ్రా పిఎస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అక్రమ కట్టడాలపై ఫిర్యాదులు భారీగా వచ్చే అవకాశం ఉంది. గతంలో వేరే పోలీస్ స్టేషన్లలో నమోదైన కబ్జా కేసులు కూడా హైడ్రా పోలీస్ స్టేషన్ కు బదిలీ కానున్నాయి. చెరువులు, కుంటలు, భూముల కబ్జా కేసులు ఇక నుండి హైడ్రా పోలీస్ స్టేషన్ లోనే నమోదు కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News