భారత్, పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగే మిస్ వరల్డ్ 2025 పోటీలపై పడింది. 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి సిఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. యుద్ధం నేపథ్యంలోనే దూరంగా ఉంటున్నట్లు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన డిన్నర్‌ను కూడా రద్దు చేసినట్టుగా తెలిసింది. ఇండో,- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని, లేదా వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. నేటి నుంచి ఈనెల 31వ తేదీ వరకు నగరంలోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అత్యంత వైభవంగా ఈ పోటీలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 1వ తేదీన హైటెక్స్ లో గ్రాండ్ ఫినాలే జరుగనుండగా 120 దేశాలకు చెందిన సుందరీమణులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.
మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవానికి సిఎం రేవంత్ రెడ్డి దూరం
- Advertisement -
- Advertisement -
- Advertisement -