Friday, May 2, 2025

రేపు ఢిల్లీకి సిఎం రేవంత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ రెడ్డి రేపు( శుక్రవారం)  ఢిల్లీకి వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్లూసీ) సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసిసి నాయకులతో పాటు, అన్ని రాష్ట్రాల ముఖ్య కాంగ్రెస్ నేతలు హాజరుకానున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణనపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్టుగా సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News