Tuesday, May 20, 2025

నల్లమల డిక్లరేషన్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నల్లమల పర్యటన సందర్భంగా ఇందిరా సౌర గిరి జల వికాసం పథకంపై నల్లమల డిక్లరేషన్‌ను ప్రకటించారు. రాష్ట్రంలోని 2 లక్షల 30 వేల 735 మంది షెడ్యుల్డ్ ట్రైబ్స్‌కు 6.69 లక్షల ఎకరాల భూములను ఆర్‌ఓఎఫ్‌ఆర్ చట్టం 2006 కింద గిరిజనుల అభివృద్ధికి ఈ నల్లమల్ల డిక్లరేషన్ ఉపయోగపడనుంది. పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తూ వారు సాగు చేసుకుంటున్న స్థానంలోనే ఇందిరా సౌర గిరి జల వికాసం కింద వంద శాతం సబ్సిడిపై గిరిజన రైతులకు ఈ పథకం కింద భూముల రెగ్యులరైజేషన్ సోలార్ పంప్ సెట్లు, బోరు బావుల తవ్వకం, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లను అందించనున్నారు. అందులోనే ఉద్యాన వన శాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టనున్నారు.

పది అంశాలతో కూడిన డిక్లరేషన్‌ను సోమవారం బహిరంగ సభలో ప్రకటించారు. 2.10 లక్షల మంది ఎస్టి రైతులకు గాను 6 లక్షల ఎకరాలను అభివృద్ధి చేయడానికి 12వేల 600 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించనుంది. 2025, 26 సంవత్సరంలో పది వేల మంది రైతులకు 27 వేల 184 ఎకరాలకు గాను 600 కోట్లను ఖర్చు చేయనుంది. ఇదే విధానం ద్వారా ప్రతి ఏడాది లబ్ధిదారులను పెంచుతూ 2029, 30 నాటికి ఈ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించి గిరిజనుల అభివృద్ధికి వినియోగించనున్నారు. ఈ పథకం ద్వారా గిరిజనులకు ఇందిరమ్మ హౌసింగ్ స్కీం ద్వారా ఈ పథకంలో లబ్ధి పొందే రైతులకు ఇళ్లను కేటాయించనున్నారు. అదే విధంగా వారికి ఆర్థిక చేయూత అందించే విధంగా ఒక లక్ష ఎస్టిల నిరుద్యోగ యువతకు సబ్సిడిపై వెయ్యి కోట్ల రూపాయలను స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం కింద వినియోగించనున్నారు. మొత్తం 10అంశాలతో కూడిన డిక్లరేషన్‌ను ముఖ్యమంత్రి మంత్రుల సమక్షంలో ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News