Thursday, May 29, 2025

నిమిషం వృధా కావొద్దు

- Advertisement -
- Advertisement -

కలెక్టర్లు క్రియాశీలకంగా ఉండాలి
కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు
వెల్లడించాలి వైఫల్యాలు ఉంటే
సరిదిద్దుకోవాలి అవసరమైతే
స్థానిక గిడ్డంగులను అద్దెకు
తీసుకోవాలి రైతులను ఇబ్బంది
పెట్టే మిల్లర్లు, దళారులపై కఠిన
చర్యలు తీసుకోవాలి ప్రభుత్వంపై
తప్పుడు ప్రచారం చేస్తే తిప్పికొట్టాలి
జూన్ 3 నుంచి 20 వరకు
మూడోదశ రెవెన్యూ సదస్సులు
ఇందిరమ్మ ఇళ్ల కోసం మండల స్థాయిలో
ధరల నియంత్రణ కమిటీ వేయాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సిఎం

మన తెలంగాణ/హైదరాబాద్ : కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టర్లు ప్రో యాక్టివ్‌గా ఉండాలని, వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలని, ఎవరైనా ప్రభుత్వంపై తప్పుడు ప్రచా రం చేస్తే వివరణ ఇవ్వాలని, ఉద్ధేశ పూర్వకంగా ప్రచారం చేస్తే వారిపై కేసులు పెట్టేందుకు కలెక్టర్ లు వెనుకాడవద్దని ముఖ్యమంత్రి రేవంత్ సూచించారు. ధాన్యం సేకరణను నిరంతరం పర్యవేక్షించాలని అవసరమైన లారీలతో రవాణా చేయాలని, అవసరమైతే స్థానికంగా గోదాములు అద్దెకు తీసుకోవాలని, ఎక్కడైనా మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే వారిపై కఠినచర్యలు తీసుకోవాల ని సిఎం కలెక్టర్‌లను ఆదేశించారు. కమాండ్ కం ట్రోల్ సెంటర్‌లో మంత్రులు, అధికారులు, కలెక్టర్‌లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కు మార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్ర భాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోద ర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో భాగంగా ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు అంశాలపై సిఎం రేవంత్ చర్చించారు. ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్‌లు ఒక్క నిమిషం వృధా చేయొద్దని, నిర్లక్ష్యం వహించొద్దని సిఎం సూచించారు.

వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉందని, సీజన్ ముందుగా రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం రేవంత్ ఆదేశించారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయని, పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సిఎం సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అలాంటి వారిపై పిడి యాక్ట్ పెట్టాలని ఆయన ఆదేశించారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలని, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆయన పేర్కొన్నారు. జిల్లాలవారీగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియనించుకోవాలని సిఎం తెలిపారు.

మరో 12 జిల్లాల్లో ధాన్యం కోనుగోళ్లను పూర్తి చేయాలి
ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయని, గతేడాది 42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని సిఎం రేవంత్ తెలిపారు. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయ్యిందని, ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను తాను అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారిందని అధికారులు సిఎంతో పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే 21.50 లక్షల టన్నుల ధాన్యం ఎక్కువగా కొనుగోలు చేశామని, మరో నాలుగైదు లక్షల టన్నుల ధాన్యం రైతుల వద్ద మిగిలి ఉందని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్‌లను ముఖ్యమంత్రి ఆదేశించారు. 33 జిల్లాలకు సంబంధించి ఇప్పటివరకు 21 జిల్లాలో ధాన్యం సేకరణ విజయవంతంగా కొనసాగిందని ఆయన తెలిపారు. 12 జిల్లాల్లో మాత్రం అక్కడక్కడ ఆందోళనలు జరిగినట్టు తన దృష్టికి వచ్చిందని కలెక్టర్‌లు క్షేత్రస్థాయికి వెళితే ఈ సమస్యలన్నీ అక్కడికక్కడే పరిష్కారమవుతాయని సిఎం రేవంత్ సూచించారు.

అనారోగ్యంతో రైతు చనిపోతే ప్రభుత్వంపై దుష్ఫచారం
ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటివరకు రైతులకు రూ. 12,184 కోట్లు చెల్లించామని, గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని సిఎం కలెక్టర్‌లతో పేర్కొన్నారు. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయని, కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయని, అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేస్తున్నారని అలాంటి ఘటనల గురించి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్‌లను సిఎం రేవంత్ ఆదేశించారు.

జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు
భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సిఎం ఆదేశించారు. గతంలో ధరణి రాష్ట్రంలో రైతుల పాలిట భూతంగా మారిందని, కొత్తగా ప్రజా ప్రభుత్వం తెచ్చిన భూ భారతి చట్టం రైతులకు చుట్టంగా మారిందన్నారు. భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయాలని, జూన్ 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సిఎం సూచించారు. అన్ని జిల్లాల ఇన్‌చార్జీ మంత్రులు రెవెన్యూ సదస్సుల నిర్వహణ షెడ్యూల్‌ను, ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

మండలస్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలి
ఇందిరమ్మ ఇళ్లు చాలా కీలకమని, క్షేత్రస్థాయిలో బాగా జరగాలంటే అది కలెక్టర్ల చేతిలోనే ఉందని సిఎం పేర్కొన్నారు. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలని, తహసీల్దార్, ఎంపిడిఓ, కార్మిక అధికారి, స్వయం సహాయక సంఘం సభ్యులతో ఈ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సిఎం రేవంత్ సూచించారు. మేస్త్రీ చార్జీలు, క్రషర్ ధరలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు. ఇసుకదందాతో లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఉచిత ఇసుక కూపన్‌లను సకాలంలో అందచేయాలని, లబ్ధిదారులకు ఇసుక కొరత రాకుండా చూడాలని ఆయన సూచించారు. ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్ల తయారీకి ఇందిరా మహిళాశక్తి, రాజీవ్ యువ వికాసం ద్వారా రుణాలు ఇప్పించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిని ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలని సిఎం ఆదేశించారు. నిరుపేదలు ఇళ్లు కట్టుకుంటే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని, కలెక్టర్‌లు తమ పనితీరును బాధ్యతగా నిర్వర్తించి ఈ పథకాన్ని విజయవంతం చేయాలని సిఎం సూచించారు. ఈనెలాఖరులోగా ఇందిరమ్మ లబ్ధిదారుల తుది జాబితాలను సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. మోడల్ ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు చూపించాలని కలెక్టర్‌లకు సిఎం సూచించారు.

ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని సిఎం రేవంత్ సూచించారు. 29, 30 తేదీల్లో జిల్లాల ఇంచార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలని, ధాన్యం సేకరణ, భూ భారతి రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధ ప్రణాళికపై కలెక్టర్‌లతో సమీక్ష నిర్వహించాలని సిఎం సూచించారు. జూన్ 1వ తేదీ నాటికి పూర్తి నివేదిక అందించాలని, జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని సిఎం ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News