- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: జూలై 7వ తేదీ జీవితంలో మరచిపోలేని మైలురాయి అని సిఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. టిపిసిసి అధ్యక్షుడిగా సిఎం రేవంత్ రెడ్డి జూలై 07వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. నాటి జ్ఞాపకాలతో సిఎం రేవంత్‌రెడ్డి చీఫ్‌గా బాధ్యతలు తీసుకుంటున్న ఫొటోను ఎక్స్‌వేదికగా సోమవారం ఆయన పోస్ట్ చేశారు. నియంతృత్వాన్ని సవాల్ చేసి నిర్భంధాన్ని ప్రశ్నించి, స్వేచ్ఛ కోసం యుద్ధం ప్రకటించిన మరిచిపోలేని సందర్భమని ట్వీట్‌లో సిఎం పేర్కొన్నారు. నేటి ప్రజా పాలనకు నాడు సంతకం చేసిన సంకల్పం, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ ఆశీస్సులు, రాహుల్ గాంధీ అండతో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జూలై 7వ తేదీ జీవితంలో మరచిపోలేని మైలురాయి అని ఆనాటి ఫొటోను సిఎం రేవంత్ ట్వీట్ చేశారు.
- Advertisement -