Sunday, August 24, 2025

రేపు రాహుల్‌తో కలిసి సిఎం రేవంత్ పాదయాత్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ఓట్ చోర్ .. గద్దీ చోడ్ పేరిట పాదయాత్ర చేపట్టిన ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్రలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్ళనున్నారు. ఓట్ల చోరీ జరిగిందని కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఉద్యమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే రాహుల్ గాంధీ ఈ నెల 26న బీహార్‌లో పాదయాత్ర చేపట్టనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొననున్నారు. అయితే ముఖ్యమంత్రి ముందుగానే ఢిల్లీకి వెళ్ళనున్నారు. బిసి రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి సోమవారం ఢిల్లీలో ప్రముఖ న్యాయనిపుణులతో చర్చించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా న్యాయ కోవిదులతో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. రిజర్వేషన్లను సాధించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదలగా ఉన్న సంగతి తెలిసిందే. చట్టపరంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాకపోయినా, తమ కాంగ్రెస్ పార్టీ తరపున రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News