Thursday, August 28, 2025

సహాయక చర్యలు పర్యవేక్షించాలని సిఎం ఆదేశాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత జిల్లాల్లోని అధికారులను అప్రమత్తం చేయాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చారు. తక్షణం చేపట్టాల్సిన సహాయక చర్యలు పర్యవేక్షించాలని సిఎం ఆదేశాలు జారీ చేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో రాష్ట్రంలో వర్షాలు, వరదల పరిస్థితి, సహాయక చర్యలపై సిఎం సమీక్షించారు. సమీక్షలో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, పలువురు అధికారులు పాల్లొన్నారు. వరద ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ రివ్యూ చేయనున్నారు. భారీ వర్షాలకు జలమయమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలను నేడు హెలికాప్టర్ ద్వారా రేవంత్ పర్యవేక్షించనున్నారు.

Read Also :ముంపు ప్రభా విత ప్రాంతాల్లో ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలి: సీతక్క

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News