Sunday, August 10, 2025

నల్లగొండలో సిఎంఆర్ఎఫ్ నిధులు గోల్‌మాల్

- Advertisement -
- Advertisement -

భువనగిరి: నల్గొండ జిల్లాలో భారీగా సిఎంఆర్ఎఫ్ నిధుల గోల్‌మాల్ అయ్యాయి. కోదాడ కేంద్రంగా కోట్ల రూపాయల దందా నడుస్తోంది.  మంజూరైన చెక్కుల తేదీలు మార్చి నకిలీలకు బదలాయిస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి డబ్బులు లబ్ధిదారులకు బదులుగా నకిలీల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు తెలుస్తోంది. సిఎంఆర్ఎఫ్ నిధుల దుర్వనియోగానికి సచివాలయ ఉద్యోగి సహకరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

గతంలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రోగులకు చికిత్స అందించకుండానే నకిలీ బిల్లులతో సిఎంఆర్‌ఎఫ్ నిధులు కొట్టేసి మోసాలకు పాల్పడ్డిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రజల సొమ్మును 28 ఆసుపత్రుల లూటీ చేశాయి. గతంలో  హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని మొత్తం 28 ప్రైవేటు ఆసుపత్రులపై ఆరు కేసులను సిఐడి బుక్ చేసిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News