Wednesday, August 20, 2025

ప్రతి రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలి: బి.ఆర్. నాయుడు

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిటిడిలో పనిచేసే అన్యమత సిబ్బందిని మరో విభాగానికి పంపే చర్యలు చేపడుతున్నామని టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు (B.R. Naidu) తెలిపారు. ఎఐ ద్వారా భక్తులకు 1-2 గంటల్లో శ్రీవారి దర్వనానికి చర్యలు ఉంటాయని అన్నారు. బి.ఆర్. నాయుడు మీడియాతో మాట్లాడారు. అన్యమత సిబ్బందిని వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పంపేందుకు చర్యలు జరుగుతున్నాయని, తిరుమలలో హోటళ్ల కేటాయింపులో గతంలో మాఫియా తయారైందని విమర్శించారు.

గతంలో విఐపి దర్శనం ఉ. 10 గం.లకు ఉండటంలో భక్తులకు ఇబ్బందులు పడ్డారని, విఐపి దర్శనాలు ఉదయం 8 నుంచి 8.30 గం.లకు ముగించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. ప్రతి రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలని సిఎం చంద్రబాబు ఆదేశించారని (Chandrababu ordered) చెప్పారు. ప్రస్తుతం 9 రాష్ట్రాల్లో టిటిడి ఆలయాలు ఉన్నాయని, టిటిడి ఆలయం విషయపై మిగిలిన రాష్ట్రాల సిఎంలకు లేఖలు రాశానని అన్నారు. మిగతా రాష్ట్రాలకు భూములు ఇవ్వగానే ఆలయాల నిర్మాణానికి సిద్ధం చేస్తామని బి.ఆర్. నాయుడు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News