Friday, July 18, 2025

భూ భారతి సమస్యలు వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్ హనుమంతరావు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మోత్కూర్: భూ భారతి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మోత్కూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారం లో సిబ్బంది నిర్లక్ష్యం గా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిర్మాణ పనుల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు మోత్కూర్ తహశీల్దార్ పి.జ్యోతి, మున్సిపల్ కమిషనర్ సతీష్ కుమార్ లను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక, సిమెంట్, స్టీల్ ల విషయంలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ పి.జ్యోతి, డిప్యూటి తహశీల్దార్ ఎం.ఉపేందర్, మున్సిపల్ కమిషనర్ కె.సతీష్ కుమార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News