- Advertisement -
హైదరాబాద్: వర్షాల కారణంగా సెలవులో ఉన్న అధికారులు, సిబ్బందిని వెనక్కి పిలిపించాలని కలెక్టర్లకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ. కోటి విడుదల చేశామని అన్నారు. పొంగులేటి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో సిఎస్ రామకృష్ణారావు పాల్గొన్నారు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు ఆదేశలిచ్చారు. వచ్చే 3 రోజుల్లో భారీ వర్షాల దృష్ట్యా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ జిల్లాల్లోని పరిస్థితి గురించి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు, ముప్పు ప్రాంతాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలపై ఆదేశాలు ఇవ్వడంతో పాటు జిహెచ్ఎంసి మున్సిపల్, ట్రాఫిక్ విభాగాలు, జిహెచ్ఎంసిలోమెట్రో వాటర్ బోర్డు సమన్వయంతో పనిచేయాలని పొంగులేటి కోరారు.
- Advertisement -