- Advertisement -
కతిహార్: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కతిహార్ జిల్లాలో కారు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు గాయపడ్డారని పోలీసులు మంగళవారం తెలిపారు. సోమవారం మధ్య రాత్రి బాధితులు పెళ్లి నుంచి తిరిగి వస్తుండగా సమేలి బ్లాక్ ఆఫీస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులందరూ సుపాల్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు.
“సమేలి బ్లాక్ ఆఫీస్ సమీపంలోని NH-31పై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను వారు ప్రయాణిస్తున్న SUV ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో అందరూ పురుషులే ఉన్నారు” అని కతిహార్ ఎస్పీ వైభవ్ శర్మ తెలిపారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపామని, ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు.
- Advertisement -