Sunday, August 3, 2025

ఇంటిల్లిపాది చూడాల్సిన సినిమా

- Advertisement -
- Advertisement -

కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం బకాసుర రెస్టారెంట్.(Bakasura Restaurant) ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్, షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్, ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మిస్తున్నారు. హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగస్టు 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈవేడుకకు హీరో సుధీర్‌బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ (Sudheer Babu said)“ప్రవీణ్ ఈ సినిమాతో హీరోగా మారుతున్నాడు. ఈ సినిమా ప్రవీణ్‌కు మంచి బ్రేక్ తీసుకురావాలని కోరుకుంటున్నా”అని అన్నారు. దర్శకుడు ఎస్‌జె శివ మాట్లాడుతూ “ప్రవీణ్ మా కథను ఒప్పుకోవడం ఈ సినిమా రూపొందడానికి ప్రధాన కారణం. ఈ చిత్రంలో వైవా హర్ష, ఫణిల పాత్రలు కూడా ఎంతో బాగుంటాయి. ట్రైలర్‌కు మించిన విధంగా సినిమా ఉంటుంది”అని పేర్కొన్నారు. ప్రవీణ్ మాట్లాడుతూ బకాసుర రెస్టారెంట్… ఇంటిల్లిపాది చూడాల్సిన ఎంటర్‌టైనర్, ఎమోషనల్ ఫిల్మ్ అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత జనార్థన్, సత్యం రాజేష్, షైనింగ్ ఫణి, వివేక్ దండు, అమర్, రామ్ పటాస్, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్, బాల సరస్వతి, వికాస్ బడిస, వినయ్ కొట్టి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News