Wednesday, July 23, 2025

దేశ వ్యాప్తంగా ఆలయాల నిర్మాణం కోసం కమిటీ : ఈఓ శ్యామలరావు

- Advertisement -
- Advertisement -

అమరావతి: సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఎపి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని టిటిడి ఈఓ శ్యామలరావు (EO Shyamala Rao) తెలిపారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణంపై కమిటీ, అలిపిరి దగ్గర మౌలిక సదుపాయాల కల్పనకు కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. శిలాతోరణం, చక్రతీర్థం అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నామని, దేశ వ్యాప్తంగా ఆలయాల నిర్మాణం కోసం అధ్యయనానికి కమిటీ వేశామని చెప్పారు. ఒంటిమిట్ట ఆలయంలో(temple Ontimitta) త్వరలోనే అన్నదానం ప్రారంభం అవుతుందని, రూ. 4.7 కోట్లతో అన్నదానం కోసం నూతన భవన నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. అన్యమత ఉద్యోగుల అంశంలో కఠినంగా వ్యవహరిస్తామని, అన్యమత ఉద్యోగుల ఇంక్రీమెంట్లలో కొంతమందికి కోత జరుగుతుందని అన్నారు. కొంతమంది అన్యమత ఉద్యోగులు విఆర్ఎస్ తీసుకునేందుకు ముందుకు వచ్చారని టిటిడి ఈఓ శ్యామలరావు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News