Tuesday, August 12, 2025

సినీకార్మికుల సమస్యలపై కమిటీ

- Advertisement -
- Advertisement -

అన్నిపక్షాలతో చర్చలు
జరిపి పరిష్కారాల
అన్వేషణ షూటింగ్‌లు
బంద్ చేసి ఆందోళనలు
చేయడం సరికాదు పని
చేస్తూనే సమస్యల
పరిష్కారానికి కృషి చేయాలి
నిర్మాతలకు ,ఫెడరేషన్
సభ్యులకు పట్టువిడుపు
ఉండాలి ఫిల్మ్ ఫెడరేషన్
నాయకులతో మంత్రి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: సినీ కార్మికులు షూటింగ్‌లను మొత్తంగా బంద్ చేసి ఆందోళన చేయడం కరెక్ట్ కాదని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. పని చేస్తూనే డిమాండ్ల సా ధన కోసం పోరాటం చేయాలని ఆయన సూచించారు. సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా కోమటిరెడ్డి భరోసా ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు సోమవారం సమావేశం అయ్యారు. రా ష్ట్రంలో సినీ కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్‌లు ని లిపివేశామని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు మంత్రితో పే ర్కొన్నారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కోమటిరెడ్డి కీలక సూచనలు చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి వి విధ సంఘాల సభ్యులను కోరారు. నిర్మాతలు, ఫెడరేష న్ సభ్యులు ఇరువైపులా పట్ట్టు విడుపు వీడాలని, చర్చలతోనే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం కార్మికుల పక్షాన ఉంటుందని, కార్మికులు చిన్న నిర్మాతల వైపు కూడా ఆలోచన చేయాలని, హైదరాబాద్‌ను ఫిల్మ్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నామని అందుకు అందరి సహకారం అవసరమని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.

కార్మికుల సమస్యల పరిష్కారానికి కమిటీ
సినిమా కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నామని, ఈ కమిటీ అన్ని పక్షాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. బుధవారం నుంచి షూటింగ్స్ పునఃప్రారంభమవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా, వినోద రంగంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో అందమైన ప్రదేశాలు ఉండటంతో అవి ఉత్తమ సినిమా షూటింగ్ లొకేషన్‌లుగా ఉపయోగించ వచ్చని ఆయన చెప్పారు. ఇది స్థానిక ప్రజలకు ఆదాయాన్ని కల్పించడమే కాకుండా ఉపాధి అవకాశాలు కూడా పెంచుతుందన్నారు. సినిమా కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అదే సమయంలో సిని పరిశ్రమలో నెలకొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉందని మంత్రి తెలిపారు. అయితే సమ్మెకు వెళ్లడం సరైన మార్గం కాదని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేద సినిమా కార్మికులకు ఇళ్లు ఇవ్వాలని, అలాగే మౌలిక సదుపాయాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలన్న లక్ష్యంతో సానుకూలంగా ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వారితో చెప్పారు.

అన్ని పక్షాల మధ్య ఐక్యత అవసరం: ఎఫ్‌డిసి చైర్మన్ దిల్ రాజు
ఎఫ్‌డిసి చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ అన్ని పక్షాల మధ్య ఐక్యత అవసరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశయాలకు అనుగుణంగా హైదరాబాద్‌ను గ్లోబల్ ఫిలిం హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ చర్యలను బలపరిచేలా అందరూ కలసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, వేతనాల పెంపుపై నిర్మాతలు, కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. నిర్మాతలు మూడు కేటగిరీలుగా కార్మికుల వేతనాలను పెంచుతామని ప్రతిపాదించారు. అయితే, ఈ ప్రతిపాదనపై కార్మిక సంఘాలు సంతృప్తి చెందలేదు. నిర్మాతల నిర్ణయం తమకు ఆమోదయోగ్యం కాదని తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రంగంలోకి దిగి సమస్యకు పరిష్కారం లభించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో హోం శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవి గుప్తా, వివిధ సినిమా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News